దశావతార వెంకటేశ్వర ఆలయం ఎక్కడ ఉంది.. ఆలయ విశిష్టత ఏమిటి?

కలియుగ దైవంగా భక్తులు వెంకటేశ్వరస్వామిని కొలుస్తారు.మన దేశంలో తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది.

 Dasavathara Sri Venkateswara Swamy Alayam Full Details In Telugu-TeluguStop.com

దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి ఈ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు.ఈ విధంగా మనదేశంలో ఎన్నో వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి.

అయితే ఈ ఆలయాలన్నింటికీ ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంది.ఈ విధంగా విశిష్టత కలిగినదే దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం.

అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశిష్టత లు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

గుంటూరు జిల్లా స‌మీపంలో ఉన్న లింగ‌మ‌నేని టౌన్‌షిప్‌లో ఏక‌శిల‌తో శ్రీ‌మ‌హావిష్ణువు ఏకాద‌శ రూపాలు అయిన 11 అడుగుల ఎత్తున్న ద‌శావ‌తార‌ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి విగ్ర‌హా రూపంలో కొలువై ఉండి భక్తులను దర్శనమిస్తున్నాడు.

పురాణాల ప్రకారం మహావిష్ణువు ఒక్కో యుగంలో ఒక్కో అవతారంలో మనకు దర్శనమిచ్చారు.ఈ క్రమంలోనే ఒక్కో అవతారంలో స్వామివారికి ఒక ఆలయం నిర్మించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

ఈ విధంగా దశావతారాలు ఎత్తిన విష్ణుమూర్తికి ప్రత్యేక ఆలయాలు ఉండటమే కాకుండా, ఈ దశావతారాలు అన్నింటిని ఒకే చోట చూడటం ఎంతో అద్భుతంగా ఉంటుంది.ఈ దశావతారాలలో శ్రీ వెంకటేశ్వరస్వామి రూపంలో ఉండటం ఈ ఆలయం విశిష్టత.

Telugu Dasavataram, Srivenkateswara, Telugu, Telugu Bhakthi-Latest News - Telugu

ఈ ఆలయంలో ఉన్న స్వామివారు తిరుమల శ్రీవారి పాదాలతోను, మోకాళ్ళ వరకు మత్స్యావతారంలో, నడుము వరకు కూర్మావతారంలో దర్శనమిస్తారు.అలాగే శ్రీనివాసుడు, నృసింహ, వరాహ అవతారాలతో త్రిముఖంగా ఉండ‌గా ఈ విగ్రహానికి ఎనిమిది చేతులు ఉంటాయి.ఇక వామన అవతారానికి సూచికగా గొడుగు, రామ అవతారానికి సూచికగా బాణం, పరశురాముడికి సూచికగా గండ్రగొడ్డలి, కృష్ణుడికి సూచికగా నెమలి పించం, కల్కి అవతారానికి సూచికగా ఖడ్గం విష్ణుమూర్తి చేతిలోని శంఖ చక్రాలను ధరించి, భక్తులకు దర్శనమిస్తున్నారు.ఈ విధంగా దశావతారాలను ఒకే విగ్రహంలో కొలువై ఉండి భక్తులను దర్శనం కల్పించటం వల్లే ఈ స్వామివారిని దశావతార వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు.

ఈ ఆలయంలోని స్వామి వారిని దర్శించుకోవడం కోసం భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటారు.ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడం వల్ల అందరి ఆశీస్సులు తమపై ఉంటాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube