1.ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలంగాణ ,మధ్యప్రదేశ్ , రాజస్థాన్ , చత్తీస్ ఘడ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించారు.
2.సిడబ్ల్యుసి సమావేశం
ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో సిడబ్ల్యుసి సమావేశం ప్రారంభమైంది .ఈ భేటీకి ఏ ఐ సి సి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు హాజరయ్యారు.
3.చంద్రబాబు అరెస్టుపై జగన్ కామెంట్స్

టిడిపి అధినేత చంద్రబాబును కక్ష సాధింపుతో అరెస్టు చేయలేదని , అసలు తనకు ఆయనపై ఎలాంటి కక్ష లేదని ఏపీ సీఎం జగన్ అన్నారు.
4.తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్ర
ఈనెల 15 నుంచి తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బస్సు యాత్రను నిర్వహించనున్నారు.
5.చంద్రబాబు బెయిల్ పిటిషన్ల కొట్టివేత

టిడిపి అధినేత చంద్రబాబు మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు కొట్టి వేసింది.
6.రాజన్న దేవస్థానం వెబ్సైట్ ప్రారంభం
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వరి స్వామి వారి దేవస్థానం వెబ్సైట్ ను ఆలయ అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు.
7.కొత్త ఆర్టీసీ చైర్మన్ బాధ్యతలు స్వీకరణ

టిఎస్ఆర్టిసి నూతన చైర్మన్ గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
8.ఏపీలో ఎన్సిసి అకాడమీ ఏర్పాటు
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఎన్సిసి అకాడమీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుగు రాష్ట్రాల ఎన్సిసి గ్రూప్ డిప్యూటీ కమాండర్ వీఏం రెడ్డి తెలిపారు.
9.కెసిఆర్ పై కిషన్ రెడ్డి విమర్శలు

పేద మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ సేవలు తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి రాకుండా కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంటుందని కేంద్రమంత్రి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు.
10.దేశంలో ఎన్నికల సంస్కరణలు రావాలి
దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలు రావాలని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.
11.ఓటరుగా నమోదుకు అవకాశం

ఓటర్ గా నమోదు చేసుకునేందుకు ఇంకా అవకాశం ఉందని జిహెచ్ఎంసి ఎన్నికల విభాగం వర్గాలు తెలిపాయి.2023 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండినవారు ఓటర్ గా పేరు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.
12.హస్తం గుర్తుపై పోటీ చేస్తాం
వచ్చే తెలంగాణ ఎన్నికల్లో హస్తం గుర్తు పైన పోటీ చేస్తామని తెలంగాణ జన సమితి పార్టీ పోటీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
13.బండరు సత్యనారాయణ ను విచారిస్తున్న పోలీసులు

మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ ను గుంటూరులోని అరండల్ పేట పోలీసులు విచారిస్తున్నారు.సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అరండల్ పేట ఎస్ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బండార సత్యనారాయణ పై కేసు నమోదు చేశారు.
14.చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం లో విచారణ
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో సిఐడి నమోదు చేసిన కేసును కొ టిడిపి అధినేత చంద్రబాబు జరిగింద
15.కాజీపేట నుంచి పూణేకు మరో రైలు సర్వీస్

వరంగల్ జనగామ భగవనగిరి నుంచి మహారాష్ట్రలోని పూణేకు మరో రైలు సర్వీసు అందుబాటులోకి వచ్చింది.
16.వైసీపీ ఎమ్మెల్యే కారుపై బాంబు దాడి
పెనుకొండ వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి శంకర్ నారాయణ కారుపై నాటు బాంబు దాడి జరిగింది.ఆ బాంబు పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
17.అమిత్ షాకు పురందరేశ్వరి ఫిర్యాదు

ఏపీ మద్యం విధానం పై సిబిఐ విచారణ జరిపించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఏపీ బీజేపీ అధ్యక్షరాలు ఫిర్యాదు చేశారు.
18.మహిళపై చిరుత దాడి
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ వెదురు కుప్పం మండలం పరిధిలోని ఎర్రగుంటపల్లి సమీపంలో ఓ తెల్ల రాసి కంకరకారి వద్ద మహిళపై చిరుత పులి దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు.
19.దుర్గగుడి ఈవోగా కేఎస్ రామారావు

బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ ఈవోగా కేఎస్ రామారావు నియమితులయ్యారు .తక్షణమే ఆయన విధుల్లో చేరాలని అధికారులు ఆదేశించారు.
20.అంతర్ రాష్ట్ర క్రికెట్ టోర్నీ
ఈనెల 12 నుంచి అండర్ 19 పురుషుల వన్డే క్రికెట్ టోర్నమెంట్ పోటీలు మంగళగిరి మూలపాడు క్రికెట్ స్టేడియంలోని మూడు వేలు ప్రారంభం కానున్నాయని ఆంధ్ర క్రికెట్b అసోసియేషన్ కార్యదర్శి ఎన్ ఆర్ గోపీనాథ్ రెడ్డి తెలిపారు.