మన భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.ఇలా ప్రసిద్ధి చెందిన ఒక్కో ఆలయంలో ఒక్కో రకమైన వింతలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
అసలు ఇది ఎలా సాధ్య పడుతుంది అనేలా భక్తులను ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఆలయాలు ఎన్నో ఉన్నాయి.అలాంటి ఆలయాలలో మహారాష్ట్రలోని సాజాపూర్ జిల్లా కాలీసింద్ నది ఒడ్డున ఉన్న గడియాఘాట్ మాతాజీ ఆలయం ఒకటని చెప్పవచ్చు.
సాధారణంగా మనం దీపం వెలిగించాలంటే తప్పనిసరిగా నూనె అవసరమవుతుంది.కానీ ఈ ఆలయంలో అమ్మవారికి దీపం వెలిగించాలంటే నూనె అవసరం లేకుండా కేవలం నీటితో మాత్రమే దీపం వెలుగుతుంది.
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.Z
కాలీసింద్ నది ఒడ్డున ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో గత ఐదు సంవత్సరాల వరకు అన్ని ఆలయాలలో మాదిరిగానే నూనెతో దీపారాధన చేసి అమ్మవారికి పూజలు చేసేవారు.
అయితే గత 5 సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో దీపారాధనకు నూనె బదులు నీటిని ఉపయోగిస్తున్నారు.ఇలా నీటితో దీపం దేదీప్యమానంగా వెలుగుతూ భక్తులకు దర్శనం కల్పించడంతో భక్తులు ఇదంతా అమ్మవారి మహిమ అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ ఆలయంలోని ప్రధాన అర్చకులు ఓ సందర్భంలో మాట్లాడుతూ గత అయిదు సంవత్సరాల క్రితం వరకు అమ్మవారు కలలో కనిపించి ఆలయంలో నీటితో దీపాన్ని వెలిగించాలని సూచించారు.అయితే ఇదంతా కలా నిజమా అనుకుని అమ్మవారు కలలో చెప్పిన విధంగానే నీటితో దీపం వెలిగించడం వల్ల దీపం ఎంతో ప్రకాశవంతంగా వెలుగుతూ ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపారు.అయితే ఈ విషయం కలా నిజమా తెలియక రెండు నెలల పాటు బయటకు చెప్పలేదని ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు.ఇక అప్పటి నుంచి ఈ ఆలయంలో అమ్మవారికి నీటితో దీపం వెలిగిస్తారు.
ఇకపోతే ఈ ఆలయం నది ఒడ్డున ఉండటం చేత ప్రతి వర్షాకాలంలోనూ ఆలయాన్ని మూసి వేసి తిరిగి దేవీనవరాత్రుల సమయంలో తెరుస్తారు.ఆలయం మూసివేసే ముందు వెలిగించిన దీపం తిరిగి దేవి నవరాత్రులప్పుడు తెరిచినా దీపం వెలుగుతూ ఉండడం మరొక ఆశ్చర్యకరమైన విషయమని చెప్పవచ్చు.