ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతిరోజు ఎన్నోవేల మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల శ్రీవారి దేవాలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని వైభవంగా నిర్వహించారు.
రంగనాయకుల మండపంలో శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది.అంతేకాకుండా సాయంత్రం మడ వీధుల్లో హనుమంత వాహనంపై వెంకటాద్రి రాముని అవతారంలో శ్రీవారు కొలువుదిరి ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
రాత్రి బంగారు వాకిలి వద్ద శ్రీరామనవమి ఆస్థానాన్ని పండితులు నిర్వహించారు.ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు బంగారు వాకిలి వద్ద దేవాలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు.
అదే విధంగా ఒంటిమిట్ట శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు.ఏప్రిల్ 5వ తేదీన శ్రీ సీతారామ కళ్యాణం( Seetharama Kalyanam ) నిర్వహించనున్నారు.

ఇంకా చెప్పాలంటే ఎండాకాలంలో తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం( TTD ) కీలక నిర్ణయం తీసుకుంది.ఎంతో కాలంగా భక్తులు కోరుతున్న విధంగా నడకదారి భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు జారీకి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది.ఇంకా చెప్పాలంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి అలిపిరి మార్గంలో పదివేలు, శ్రీవారి మెట్టు మార్గంలో ఐదు వేల దివ్య దర్శనం టోకెన్లు మంజూరు చేయనున్నట్లు తిరుమల దేవస్థానం వెల్లడించింది.వారం తర్వాత ఈ టోకెన్లు జారి పైన తుది నిర్ణయం తీసుకుంటామని దేవాలయం ముఖ్య అధికారులు వెల్లడించారు.అందుకోసం విఐపి బ్రేక్, శ్రీవాణి, టూరిజం కోట,వర్చువల్ సేవలు రూ.300 దర్శనం టికెట్లు తగ్గించాలని నిర్వహించినట్లు సమాచారం.దీని వల్ల మూడు నెలల పాటు సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండే అవసరం ఉండదని తిరుమల దేవస్థానం వెల్లడించింది.