ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఎక్కువగా పచ్చదనాన్ని ఇష్టపడతారు.అలాగే ఇంట్లో కూడా చిన్నచిన్న మొక్కలను నాటుకుంటూ ఉంటారు.
అంతేకాకుండా ఇంట్లోనీ పెరట్లో కూడా మొక్కలను పెంచుతూ వాటి మధ్య సేదతీరుతూఉంటారు.ఇంట్లో మొక్కలను పెంచడం వల్ల ఆ ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి వస్తూ ఉంటుంది.
కానీ కొన్ని మొక్కలను పెంచడం వల్ల ఇంటికి పేదరికం వచ్చే అవకాశం కూడా ఉంది.అటువంటి మొక్కలు ఏమిటో ఏమిటో ఇప్పుడు వాటిని నాటితే ఎలాంటి ఆ శుభాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకుపచ్చ రంగు అనేది చూడడానికి ఎంతో ఆనందంగా, పచ్చని మొక్కలను చూస్తూ ఉంటే కళ్ళకు ఏదో శక్తి వచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది.ఇంకా చెప్పాలంటే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం కూడా ఉంది.
అలాగని ఏ మొక్క దొరికితే ఆ మొక్కను తెచ్చి ఇంట్లో పెంచడం మాత్రం ప్రమాదం అని వాస్తు నిపుణులు చెబుతున్నారు.ఇలా చేయడం వల్ల ఉద్యోగ వ్యాపారాలలో ఎన్నో రకాల ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందుల కారణంగా కుటుంబ ప్రశాంతత దూరమయ్యే అవకాశం ఉంది.అందువల్ల ఇంటి ముందు ఇలాంటి కొన్ని మొక్కలను నాటకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు ఎప్పుడూ కూడా అమల మొక్కలు ఉండకూడదు ధారణకు గులాబీ మొక్క నిమ్మ మొక్కను ఎప్పుడూ ఇంటి ముందు పెంచడం అంత మంచిది కాదు ముందు ద్వేషం కలహాలకు చిహ్నం అని పెద్దవారు చెబుతూ ఉంటారు ఇలాంటి మొక్కలు నాటడం వల్ల కుటుంబంలో మనస్పర్దాలు కలహాలు వచ్చి కుటుంబమే నాశనం అయ్యే అవకాశం ఉంది.
వాస్తు శాస్త్రం ప్రకారం కుటుంబ సభ్యులు నివసించే ఇంటి దగ్గర చింత చెట్టు ఎప్పుడూ నాటకూడదు చింత పండు ఇంటి సభ్యుల మధ్య విభదాలను పెంచే అవకాశం ఉంది శత్రుత్వం తరచుగా కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతను దూరం చేస్తుంది కాబట్టి ఈ చింతచెట్టు ఇంటి ముందు పెంచకపోవడం మంచిది.