చాలా మంది సినిమాల్లో నటించాలనే కలను మాత్రమే కంటారు.కానీ అది కొంత మందికి మాత్రమే సాధ్యమవుతుంది.
అలా సాధ్యం కావాలంటే వారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఎన్నో కష్టనష్టాలను కూడా చూడాల్సి వస్తుంది.
సినిమానే జీవితం అనుకొని చేస్తున్న ఉద్యోగాలు మానేసి సినిమా కంపెనీల చుట్టూ తిరుగుతూ తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఉంటారు.అలా ఎవరో ఒకరికి దక్కే అవకాశం వారిని నటిగా లేదా నటుడిగా మార్చుతుంది.
వారు అక్కడ నుంచి మళ్లీ స్టార్ అవ్వాలంటే అదేమీ మామూలు జర్నీ కాదు.ఇన్ని ఒడిదుడుకుల నడుమ ఒక వ్యక్తి లేదా ఒక యువతి సినిమా జీవితాన్ని, సినిమా కష్టాలని దాటి ముందుకు వెళ్లాలంటే ఎన్ని చూడాల్సి వస్తుందో మాటల్లో చెప్పడం కష్టం.

ప్రస్తుతం ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది బేబీ( Baby ) సినిమాలో నటించిన హీరోయిన్ వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ).ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే వైష్ణవి చైతన్య బేబీ సినిమాలో నటించిన పాత్ర తీరుతెన్నులు చాలామంది యువతకు నచ్చలేదు.తాము తమ జీవితంలో అలాంటి అమ్మాయిల వల్లే కష్టాలు అనుభవిస్తున్నాము అని అనుకుని, అందుకు ఉపశమనం పొందడం కోసం వైష్ణవి పై మాటల యుద్ధం మొదలుపెట్టారు.సోషల్ మీడియాలో ఆమెపై తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతుంది.
అంతేకాదు వైష్ణవి ఇలాంటి అమ్మాయిలు నిజంగానే ఉన్నారు అలా అని వైష్ణవి ఆ తప్పు చేసింది అని కాదు కదా.

ఇటీవల ఆమె ఒక వ్యక్తి చెప్పు విసిరిన సంఘటన కూడా వైరల్ అవుతుంది.మనిషి ఎంత వికృత రూపం దాల్చుతున్నాడో చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు.వైష్ణవి ఎవరిని మోసం చేసింది, ఆమె వల్ల ఎవరు నష్టపోయారు సినిమాలో మాత్రమే ఆ పాత్ర నటించింది.
కానీ హద్దులు లేని సోషల్ మీడియా అంతులేని కరకశాత్వం వల్ల ఒక అమ్మాయి నిజంగా ఈరోజు బాధపడుతోంది వైష్ణవి తన స్నేహితులతో, దగ్గర వాళ్లతో తన కన్నీళ్లు పెట్టుకున్న విషయం బయటకు వస్తుంది.తను బేబీ సినిమాలో నటించడం వల్ల ఎంత కోల్పోతుంది అనే విషయాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకుని ఆమెకు ప్రైవసీ కలిగించాలని కోరుకుందాం.