తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక్క సినిమా అయిన చేయాలి అని చాలా మంది హీరోయిన్స్ ( Heroines )పోటీ పడుతున్నారు…అందులో చాలా మంది ఉన్నప్పటికీ ఆ ఛాన్స్ కొందరికి మాత్రమే వస్తుంది…ముఖ్యంగా అందులో మృణాల్ ఠాకూర్ ఒకరు…ఈమెని ఒకప్పుడు అయితే పరిచయం చేయాల్సి ఉండేది.కానీ ఇప్పుడు అలాంటి పని లేకుండా పోయింది.
హను రాఘవపూడి( Hanu Raghavapudi ) దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారడమే కాకుండా .తన ఖాతాలో క్రేజీ క్రేజీ ఆఫర్స్ పట్టిస్తున్న మృణాల్ ఠాకూర్( Mrinal Thakur ) ప్రజెంట్ తెలుగులో మూడు సినిమాల్లో నటిస్తుంది .ముగ్గురు కూడా బడా హీరోలే కావడం గమనార్హం.కాగా ఎన్టీఆర్ దేవర సినిమాలో సెకండ్ హీరోయిన్ కోసం రష్మిక -మృణాల్ పోటీ పడుతున్నారు .ఒకవేళ ఈ సినిమాలో మృణాల్ కన్ఫామ్ ఐతే ఏకంగా నాలుగు బడా సినిమాలు ఆమె ఖాతాలో చేరుతాయి.

అయితే మృణాల్ సీతారామం( Sitaram ) సినిమా కంటే ముందే తెలుగులో మరో హిట్ సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సి ఉండిందట.కానీ అమ్మడు ఆ లక్కీ ఛాన్స్ ని మిస్ చేసుకుంది.ఆ సినిమా మరేదో కాదు విజయ్ దేవరకొండ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన గీతాగోవిందం … పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను క్లీన్ స్వీప్ చేసేసింది .ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా అనుకునే కన్నా ముందే మృణాల్ ఠాకూర్ ను అనుకున్నారట పరశురాం .అయితే అప్పటికి మృణాల్ ఠాకూర్ కి అప్పటికి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు.

రష్మిక అట్లీస్ట్ ఛలో సినిమాతో అయినా తెలుగు జనాలకు పరిచయమైంది .ఆ కారణంగానే రిస్క్ చేయడం ఇష్టం లేక పరశురాం.రష్మికను చూస్ చేసుకున్నారట .అంతేకాదు విజయ్ దేవరకొండ సైతం రష్మికతో నటించడానికి సిద్ధంగా ఉండడంతో ఆ కాంబోనే సెట్ అయింది.అలా మృణాల్ తెలుగులో నటించే అవకాశం మిస్ అయి.ఫైనల్లీ మళ్ళీ తెలుగు సినిమాతోనే ఫస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకుంది .అయితే అప్పుడు అలా మిస్సయిన ఈ కాంబో మళ్లీ ఇన్నాళ్లకు సెట్ అయింది .గీతగోవిందం 2 ( Gita Govindam 2 )సినిమాలో మృణాల ఠాకూర్ ను చూస్ చేసుకున్నారు పరశురాం.గీతాగోవిందం సినిమా వన్ మిస్ అయిన గీతాగోవిందం సీక్వెల్ లో ఛాన్స్ దక్కించుకుంది అన్న కామెంట్లు ఎక్కువగా చేస్తున్నారు…ఇక ఈ సినిమా వాళ్ల తనకి ఎంత మంచి పేరు వస్తుంది అనేది చూడాలి…
.