కేశాలు పొడ‌వుగా పెర‌గాలా..అయితే డైట్‌లో వీటిని చేర్చాల్సిందే!‌

కురులు పొడ‌వుగా, ఒత్తుగా ఉంటే అమ్మాయి అందం రెట్టింపు అవుతుంది.అందుకే అమ్మాయిలు త‌మ కేశాలు పొడ‌వుగా పెర‌గాల‌ని కోరుకుంటారు.

 These Foods Are Help To Increase Hair Growth! Good Foods, Increase Hair Growth,-TeluguStop.com

అందుకోసం ఖ‌రీదైన నూనెలు, షాంపూలు కూడా వాడుతుంటారు.అయితే ఎన్ని ర‌కాల నూనెలు, షాంపూలు వాడినా కొంద‌రిలో జుట్టు పెర‌గ‌డం అటుంచు.

త‌ర‌చూ రాలుతూనే ఉంటుంది.ఇందుకు చాలా కార‌ణాలు ఉన్నాయి.

పోష‌కాహార లోపం, ఒత్తిడి, వాతావ‌ర‌ణంలో మార్పులు, హార్మోన్ల బ్యాలెన్స్‌లో ఆటంకాలు ఇలా అనేక కార‌ణాలు వ‌ల్ల జుట్టు పెర‌గ‌డం త‌గ్గిపోయి.ఊడ‌టం పెరుగుతుంది.

అయితే ఈ స‌మ‌స్య‌ను నివారించాలంటే.ఖ‌చ్చితంగా కొన్ని కొన్ని ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది.అలాంటి వాటిలో శెనగలు కూడా ఉంటాయి.శెన‌గ‌ల్లో ప్రోటీన్, ఐర‌న్‌, పొటాషియం, మెగ్నీషియం, విట‌మిన్ ఎ, విట‌మిన్ బి ఇలా ఎన్నో పోష‌కాలు నిండి ఉంటాయి.

ఈ పోష‌కాల‌న్నీ కేశాలు ఎదుగుద‌ల‌కు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.అందువ‌ల్ల శెన‌గ‌ల‌ను డైట్‌లో చేర్చుకుంటే.

జుట్టు రాల‌డం త‌గ్గి పొడ‌వుగా పెరుగుతుంది.

Telugu Avocado, Tips, Beetroot, Carrots, Diet Long, Eggs, Foods, Healthy, Health

అలాగే జుట్టు పెరుగుదలను ప్రోత్సహించ‌డంలో అవోకాడో ముందు ఉంటుంది.అవోకాడోను రెగ్యుల‌ర్ డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల‌.అందులో ఉండే పోష‌కాలు కేశాలు పొడ‌వుగా పెరిగేందుకు స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌రియు జుట్టును డ్యామేజ్ కాకుండా స‌హాయ‌ప‌డ‌తాయి.

చాలా మంది బీట్ రూట్ తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు.

కానీ, జుట్టు పొడ‌వుగా, ఒత్తుగా పెర‌గాలి అని అనుకునే వారు బీట్ రూట్‌ను ఖ‌చ్చితంగా డైట్‌లో చేర్చుకోవాల్సిందే.బీట్ రూట్‌లో ఉండే లైకోపిన్ జుట్టు రాలడాన్ని త‌గ్గించి.

పెరిగేందుకు స‌హ‌క‌రిస్తుంది.ఇక వీటితో పాటు గుడ్డు, పాలు, డ్రై ఫ్రూట్స్‌, చేప‌లు, ఆరెంజ్, వెల్లుల్లి, క్యారెట్స్‌ వంటి ఆహారాలు కూడా జుట్టు పెరుగుద‌ల‌కు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

అయితే వీటిని డైట్‌లో చేర్చుకోవ‌డ‌మే కాదు.మ‌ద్య‌పానం, ధూమ‌పానం అల‌వాట్ల‌కు దూరంగా కూడా ఉండాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube