ప్రపంచవ్యాప్తంగా వంటల్లో విరి విరిగా ఉపయోగించే వాటిలో వెల్లులి ఒకటి.ఘాటైన రుచి, వాసన కలిగి ఉండే వెల్లుల్లిలో.
విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్, శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక పోషకాలు నిండి ఉంటాయి.అందుకే వెల్లుల్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఎన్నో వ్యాధులను కూడా నివారిస్తుంది.ఈ నేపథ్యంలోనే వెల్లుల్లిని కొందరు అతిగా తీసుకుంటుంటారు.
అయితే, హెల్త్‌కు ఎంత మేలు చేసినప్పటికీ.వెల్లుల్లి విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
లేదంటే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
సాధారనంగా రక్త పోటు స్థాయిలను తగ్గించే సమర్థం ఉంది.
అందు వల్ల లో బీపీతో బాధ పడే వారు వెల్లల్లి ఓవర్‌గా తీసుకుంటే.రక్త పోటు స్థాయిలు మరింత దిగజారి ప్రాణాలే ప్రమాదంలో పడతాయి.
అలాగే కొందరు ఆరోగ్యానికి మంచిదని ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లిని తింటుంటారు.కానీ, ఇలా చేయడం వల్ల వాంతులు, వికారం, గుండెల్లో తీవ్రమైన మంట వంటి సమస్యలు ఏర్పడతాయి.
గర్భిణీలు వెల్లుల్లిని పరిమితికి మించి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరాదు.

ఎందుకంటే, వెల్లుల్లిలో ఉండే పలు రసాయనాలు తల్లి మరియు కడుపులోని శిశువు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి.మధుమేహం రోగులకు వెల్లుల్లి ఎంతో మేలు చేస్తుంది.అలా అని చెప్పి వెల్లిల్లి అతిగా తీసుకుంటే మాత్రం.
రక్తంలో చక్కెర స్థాయిలు ఉండాల్సిన దాని కంటే తక్కువగా పడిపోతాయి.దాంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కొందరు రక్తం పల్చబడటానికి ముందులు వాడుతూ ఉంటారు.

అలాంటి వారు వెల్లుల్లిని చాలా తక్కువగా తీసుకోవాలి.లేదంటే పలు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.ఇక హెల్త్‌కు మంచిదనే కారణంగా.
కొందరు పచ్చి వెల్లుల్లిని తినేస్తుంటారు.కానీ, పచ్చి వెల్లుల్లిని అధికంగా తీసుకుంటే.
తల నొప్పి, కళ్లు తిరగడం, కంటి చూపు మందగించడం, జీర్ణ సంబంధిత వ్యాధులు, ముక్కులో నుంచి రక్తం కారడం వంటి సమస్యలతో సతమతమవ్వాల్సి వస్తుంది.