ఇన్స్టెంట్ స్కిన్ వైటనింగ్ కావాలని ఎవరు కోరుకోరు చెప్పండి.దాదాపు అందరికీ అదే కావాలి.
ముఖ్యంగా ఏ పెళ్లో, ఫంక్షనో వచ్చిందంటే తమ స్కిన్ వైట్‌గా, బ్రైట్‌గా మెరిసిపోవాలని బ్యూటీ పార్లర్స్‌కు పరుగులు పెడుతుంటారు.అక్కడ వేలకు వేలు తగలేస్తుంటారు.
కానీ, ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఆలు గడ్డతో చర్మాన్ని తెల్లగా మెరిపించుకోవచ్చని మీకు తెలుసా? అవును, ఆలు గడ్డతో ఇన్స్టెంట్‌గా స్కిన్‌ను వైట్‌గా మరియు గ్లోగా మార్చుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆలు గడ్డను ఎలా యూజ్ చేయాలో చూసేయండి.
మొదట ఒకటి లేదా రెండు ఆలు గడ్డలను తీసుకుని పీల్ తీసి శుభ్రం చేసుకోండి.ఇప్పుడు ఆలు గడ్డను మెత్తగా పేస్ట్ చేసేసి రసం తీసుకుని పెట్టుకోవాలి.
ఈ ఆలు గడ్డ రసాన్ని నాలుగు స్టెప్స్‌లో మీ చర్మానికి అప్లై చేయాల్సి ఉంటుంది.అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టెప్-1 ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల ఆలు గడ్డ రసం మరియు ఒక స్పూన్ పచ్చి పాలు పోసుకుని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమంతో ముఖానికి మరియు మెడకు క్లెన్సింగ్ చేసుకుని వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.
తద్వారా చర్మంపై మురికి మొత్తం పోతుంది.
స్టెప్-2 ఒక బౌల్ లో రెండు స్పూన్ల ఆలు గడ్డ రసం, ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసి స్మూత్‌గా స్క్రబ్ చేసుకోవాలి.మూడు, నాలుగు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకుని అపై వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.
ఈ స్క్రబ్బింగ్ వల్ల మృతకణాలు పోయి స్కిన్ బ్రైట్‌గా మారుతుంది.
స్టెప్-3: ఒక బౌల్‌లో ఒక స్పూన్ ఆలు గడ్డ రసం, ఒక స్పూన్ అలోవెర జెల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పూసి ఐదు నుంచి పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.అపై వాటర్‌లో శుభ్రం చేసుకోవాలి.తద్వారా చర్మం గ్లోగా మరియు సాఫ్ట్‌గా మారుతుంది.
స్టెప్-4: ఒక బౌల్‌లో మూడు స్పూన్ల ఆలు గడ్డ రసం, రెండు స్పూన్ల చందనం పొడి, ఒక స్పూన్ పెరుగు వేసుకుని కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు, ముఖానికి ప్యాక్‌లా వేసుకుని ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.అనంతరం ఫేస్ వాష్ చేసుకోవాలి.
అంతే ఈ నాలుగు స్టెప్స్‌ను మీరు గనుకు పాటిస్తే ఖచ్చితంగా కలర్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది.