ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజలలో చిన్న వయసులోనే జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువగా పెరిగిపోతోంది.ఈ సమస్యతో అందరూ ఇబ్బంది పడుతున్నారు.
జుట్టు ఎక్కువగా రావడం మొదలవుతే ప్రజలలో బట్టతల కూడా వచ్చే అవకాశం ఉంది.అయితే కొంతకాలం క్రితం పెద్ద వ్యక్తుల జుట్టు మాత్రమే ఎక్కువగా రాలిపోయి వారిలోనే ఎక్కువగా బట్టతల కనిపించేది.
అయితే ఈ సమయంలో చాలా చిన్న వయసులో పిల్లలు జుట్టు రాలడం మొదలైంది.దీనివల్ల చాలా మంది ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఎందుకంటే పిల్లలకు కూడా బట్టతల రావడం మొదలైంది.తాజాగా ప్రస్తుత సమాజంలో ఆహారం, పర్యావరణం మారీపోవడమే దీని వెనుక ఉన్న అతి పెద్ద సమస్య.
చిన్న వయసులోనే జుట్టు రాలడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎక్కువగా జంక్ తీసుకోవడం ప్రారంభించారు.దీనివల్ల స్థూలకాయామే కానీ శరీరానికి ఎలాంటి పోషకాలు అందవు.అంతేకాకుండా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
ఇంకా చెప్పాలంటే కరోనా తర్వాత పిల్లలలో రోగనిరొదక శక్తి కూడా చాలా బలహీనంగా మారిపోయింది.దాని వల్ల రకరకాల మందులు వేసుకోవాల్సి వస్తుంది.
దీని వల్ల పిల్లలలో సైడ్ ఎఫెక్ట్స్, హార్మోన్లు మార్పు వచ్చి జుట్టు రావడం మొదలైంది.
ఈ రోజుల్లో పిల్లల మధ్య చాలా పోటీ పెరిగిపోయింది.పిల్లలకు కూడా అనేక రకాల ఒత్తిడి ఉంది.దీని ఫలితంగా పిల్లలలో కూడా జుట్టు రాలడం మొదలైంది.
ఒత్తిడి ఎక్కువగా ఉంటే మాత్రం మెదడు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది.ఇంకా చెప్పాలంటే ఈరోజుల్లో పిల్లలు కూడా అందంగా కనిపించేందుకు హెయిర్ జెల్స్ వాడడం ప్రారంభించారు.
దీనివల్ల వారి జుట్టు బాగా కనిపించినా అది కొన్ని రోజుల తర్వాత ఆ జుట్టు రాలడం మొదలవుతుంది.ఇలాంటి వాటిని దూరం చేసుకుంటే జుట్టు రాలే సమస్య దూరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.