ప్రదక్షిణలు చేసేప్పుడు.. ఆలయం వెనుక తాకవచ్చా..?

మనం గుడికి వెళ్లినప్పుడు. ప్రదక్షిణం చేస్తాం.

 Can Touch Temple Back Part While We Doing Circumferences , Devotional , Telugu-TeluguStop.com

 కొందరైతే ఆత్మ ప్రదక్షిణ చేస్తారు. మరికొందరు దేవుడి చుట్టూ లేదా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.

 ప్రదక్షిణలు చేస్తే. ఆనందం, శ్రేయస్సు, సంపద కలుగుతుందని నమ్ముతారు.

 గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. కొంతమంది ఆలయం వెనుక భాగం తాకుతూ. నమస్కరిస్తూ. ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణలు చేసేప్పుడు గుడి వెనుక భాగం తాకకూడదని పురణాలు చెబుతున్నాయి.

కొన్ని శాస్త్రాల ప్రకారం, గుడిలోని వెనుక భాగంలో రాక్షసులు ఎక్కువగా ఉంటారు.

 అందుకే మనం ఆ వైపున తాకితే రాక్షసులను నిద్రలేపినట్టు అవుతుందట. రాక్షసుల ప్రతికూల ప్రభావాలన్నీ మనపై పడతాయట.

 అప్పుడు గుడికి వెళ్లి దేవుడిని ఎంత ప్రార్థించినా మీకు పుణ్యం కంటే నెగిటివ్ రిజల్ట్స్ వచ్చి అనేక సమస్యలు వస్తాయట.ఏ దేవుడి గుడికి వెళితే, ఆ దేవుడికి సంబంధించిన స్తోత్రం పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి.

 స్తోత్రం మొత్తం తెలియాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. మీకు స్తోత్రం రాకపోతే.

 దేవుని నామం జపం చేస్తూ. మనస్సు కేంద్రీకరించి ప్రదక్షిణ చేయటం చాలా ముఖ్యం.

 ఇతర ఆలోచనలతో ప్రదక్షిణలు చేసినా ఒకటే. రోడ్డు మీద నడిచినా ఒకటే.

 అలౌకిక విషయాలను పక్కన పెడితే ప్రదక్షిణ శరీరానికి, మనస్సుకు కూడా ఉపయోగకరంగానే వుంటుంది.

ప్రదక్షిణలు కూడా శాస్త్రీయ ప్రాముఖ్యత కలిగి ఉంది. రోజువారీ పూజా స్థలంలో సానుకూల శక్తి ప్రసారం అవుతుంది. అందుకే ఈ ప్రదక్షిణలు చేయాలని నమ్ముతారు.

 ఈ శక్తి మానవ శరీరంలోకి ప్రవేశించినప్పుడు, ఆత్మవిశ్వాసం బలపడుతుందని, శాంతిని కలుగుతుందని చెబుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube