మన దేశంలో అత్యంత శక్తిమంతమైన అష్టాదశ శక్తి పీఠాల్లో అసోంలో కొలువై ఉన్న కామాఖ్యా దేవి క్షేత్రం ఒకటి.ఆ తల్లికే కామరూపిణి అనే మరో పేరు ప్రాచుర్యంలో ఉంది.
అంటే తలచిన వెంటనే కోరుకున్న రూపంలోకి మారిపోవడం.ఇక్కడి అమ్మవారికి విగ్రహ రూపం ఉండదు.
యోని ఆకారంలో అన్న శిలనే విగ్రహంగా భావించి కొలుస్తారు దశ మహావిద్యలకు ప్రతీకగా పూజిస్తారు.భక్తుల కోర్కెలను తీర్చడానికి కామాఖ్యాదేవి అనేక రూపాలను ధరించిందని పురాణాలు చెబుతున్నాయి.
సతీ దేవి తండ్రి దక్ష ప్రజాపతి ఆమె భర్త పరమేశ్వరుడిని ఆహ్వానించకుండా యాగం చేస్తాడు.ఎందుకిలా చేశఆవని ప్రశ్నించిన కూతుర్ని అవమానిస్తాడు.
సహించలేని ఆమె యజ్ఞ గుండంలో దూకి అగ్నికి ఆహుతి అయిపోతుంది.ఆగ్రహోదగ్రుడైన పరమేశ్వరుడు వీర భద్రుడిని సృష్టించి యాగాన్ని భగ్నం చేయిస్తాడు.
విరాగిలా మారి భార్య మృత దేహాన్ని భుజాన వేసుకొని తిరుగుతుంటాడు.ఈశ్వరుడు తన కర్తవ్యాన్ని మరచి బాధతో అలా తిరుగుతుండటం వల్ల సృష్టి లయ తప్పుతుందని భావించిన శ్రీ మహా విష్ణువు సతీదేవి దేహాన్ని సుదర్శన చ్రంతో ఖండిస్తాడు.
ఈ ముక్కలన్నీ వివిధ ప్రాంతాల్లో చెల్లా చెదురుగా పడతాయి.అమ్మవారి యోని భాగం గౌహతీ వద్ద నీలాచలంపై పడటంతో ఆ పర్వతం నీలంగా మారిందంటారు.
ఈ ప్రాంతంలోనే కామాఖ్యదేవి కొలువై ఉంటుందని ప్రతీతి.మానవ సృష్టికి మూల కారణం అయిన స్థానం కాబట్టి ఈ ప్రదేశం అన్ని శక్తి పీఠాలోకె్లా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.
జన్మలో ఒక్కసారైనా ఈ పర్వతం తాకితే అమరత్వం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.