బాబాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించి ఎన్నో సినిమాలను అందించిన దర్శకుడు మణిరత్నం, శంకర్… మణిరత్నం ఎన్నో ప్రేమకథా చిత్రాలను, భారీ హిట్ చిత్రాలను అందించారు.ఇక శంకర్ ఎలాంటి భారీ చిత్రాలను తెరకెక్కించారో మన అదరికీ తెలిసిందే.
సౌత్ కి పాన్ ఇండియా చిత్రాలను పరిచయం చేసింది శంకర్.ఇప్పుడు వీరి కాంబినేషన్లో కాసులు వర్షం కురిపించడానికి రెడీ అయ్యారు.
ఈ ఇద్దరూ.మరో కొందరికి అగ్ర దర్శకులతో కలిసి ‘రెయిన్ ఆన్ ఫిల్మ్స్‘ పేరుతో ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించారు.
థియేటర్, ఓటీటీ, ఇలా పలు ప్లాట్ ఫామ్ లకు, సినిమాలు, వెబ్ సిరీస్ నిర్మించాలన్నది, కొత్త మేకర్స్ కి అవకాశం ఇవ్వాలన్నది ఈ నిర్మాణ సంస్థ సంకల్పం.ఈ బ్యానర్ లో మణిరత్నం, శంకర్ తో పాటు భాగస్వాములైన వారు ఏ.
ఆర్ మురుగదాస్, గౌతమ్ మీనన్, వెట్రిమారన్, లింగుస్వామి, లోకేష్ కనగరాజ్, వసంతబాలాన్, బాలాజీ శక్తివేల్ ఉన్నారు.తొలి ప్రాజెక్ట్ కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.