మగువల అందాన్ని డిసైడ్ చేయడంలో ఐబ్రోస్ ( Eyebrows )కీలక పాత్రను పోషిస్తాయి.ఒత్తయిన ఐబ్రోస్ ముఖాన్ని మరింత అట్రాక్టివ్ గా చూపిస్తాయి.
అందుకే దాదాపు అందరూ ఒత్తైన ఐబ్రోస్ ను కోరుకుంటూ ఉంటారు.కానీ అందరికీ ఐబ్రోస్ ఒత్తుగా ఉండకపోవచ్చు.
మీరు కూడా పల్చటి ఐబ్రోస్ తో బాధపడుతున్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే మీ పల్చటి ఐబ్రోస్ ను కొద్ది రోజుల్లోనే ఒత్తుగా అందంగా మార్చుకోవచ్చు.
అందుకోసం ముందుగా ఒక చిన్న ఉల్లిపాయ( onion ) తీసుకుని తొక్క తొలగించి సన్నగా తురుముకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో అర కప్పు ఆవ నూనె వేసుకోవాలి.అలాగే ఉల్లిపాయ తురుము వేసి చిన్న మంటపై దాదాపు ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ లో హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ ( Vitamin E oil )వేసుకుని బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ ఆయిల్ ను ఒక బాటిల్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.ఉదయం స్నానం చేయడానికి గంట ముందు మరియు నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్ ను ఐ బ్రోస్ కు అప్లై చేసి సున్నితంగా వేళ్ళతో మసాజ్ చేసుకోవాలి.రోజుకో రెండుసార్లు ఈ ఆయిల్ ను కనుక వాడితే మీ ఐబ్రోస్ ఎంత పల్చగా ఉన్నా కూడా ఒత్తుగా మారతాయి.ఐబ్రోస్ గ్రోత్ ను పెంచడానికి ఈ ఆయిల్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

అలాగే ఈ ఆయిల్ ను మీరు మీ జుట్టుకు కూడా ఉపయోగించవచ్చు.ఉల్లి, ఆలివ్ ఆయిల్ మరియు విటమిన్ ఈ ఆయిల్ లో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.జుట్టు రాలే సమస్యను అరికడతాయి.మరియు కురులు ఒత్తుగా పొడుగ్గా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.