టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో ఆది పినిశెట్టి( Aadhi Pinisetty ) ఒకరు.శబ్దం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన వైవాహిక జీవితానికి సంబంధించి వైరల్ అవుతున్న ఫేక్ వార్తల గురించి ఆయన స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.
నిక్కీ గల్రానీ( Nikki Galrani ) మొదట నాకు మంచి ఫ్రెండ్ అని నా కుటుంబ సభ్యులకు కూడా ఆమె ఎంతో చేరువైందని చెప్పుకొచ్చారు.మా ఇంట్లో వాళ్లు సైతం ఆమెకు బాగా నచ్చారని ఆది వెల్లడించారు.
ఆమెతో ఉంటే మాత్రమే నేను సంతోషంగా ఉంటానని అనిపించిందని ఆది అన్నారు.పెద్దల అంగీకారంతో మేము వివాహం చేసుకున్నామని సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నామని ఆది కామెంట్లు చేశారు.
అయితే మేమిద్దరం విడాకులు( Divorce ) తీసుకుంటున్నామని యూట్యూబ్ లో కథనాలు వచ్చాయని ఆది పినిశెట్టి అభిప్రాయం వ్యక్తం చేశారు.

మొదట ఆ వార్తలు చూసి బాగా షాకయ్యానని బాగా కోపం వచ్చిందని ఆ తర్వాత ఆయా యూట్యూబ్ ఛానెళ్లలో ఉన్న పాత వీడియోలను చూసి ఇలాంటి వాళ్లను పట్టించుకోకపోవడం మంచిదనిపించిందని ఆయన తెలిపారు.అలాంటి వాళ్లను పట్టించుకోకుండా కెరీర్ ను కొనసాగిస్తున్నానని యూట్యూబ్ క్లిక్స్ కోసం ఎంతకైనా తెగిస్తారని ఆ వీడియోలను చూస్తే అర్థమైందని ఆది పినిశెట్టి పేర్కొన్నారు.

రంగస్థలం సినిమా తెలుగుతో పాటు తమిళంలో మంచి పేరు తెచ్చిపెట్టిందని ఆయన వెల్లడించారు.ఆ సినిమా ఇప్పుడు రిలీజై ఉంటే పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించేదని ఆది పినిశెట్టి చెప్పుకొచ్చారు.సరైనోడు సినిమా రిలీజ్ తర్వాత నాకు చిరంజీవి నుంచి ఫోన్ వచ్చిందని ఆయన కామెంట్లు చేశారు.
నటుడు ఆది పినిశెట్టి ప్రస్తుతం అఖండ సీక్వెల్ లో( Akhanda Sequel ) తెలుగులో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.