ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Tollywood ) చాలామంది హీరోలు సినిమాలు చేస్తూ వస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం తెలుగు సినిమా స్థాయిని పెంచడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు.మరి వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ వాళ్లకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటున్నారు.
ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ రేంజ్ ఒకలా ఉంటే ఇకమీదట నుంచి మరోలా మారబోతుంది.

యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా( Star Heroes ) గుర్తింపును సంపాదించుకున్న ఇతర భాషల హీరోలు మన తెలుగు సినిమా నుంచి వచ్చే హీరోల తాకిడిని తట్టుకోవడం చాలా వరకు కష్టమనే చెప్పాలి.ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా రేంజ్ అనేది మారిపోయింది.నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తుందనే చెప్పాలి.
మరి ఇలాంటి సందర్భంలోనే మన వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు సాగుతున్నారు.దానికోసమే డిఫరెంట్ జానర్ లో సినిమాలను చేస్తూ మంచి దర్శకులతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది…

మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్న క్రమంలో మన ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలతో యంగ్ హీరోలు( Young Heroes ) సైతం ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన అవసరమైతే ఉంది.ఒకప్పుడు తెలుగు వాళ్ళ సినిమాలను పట్టించుకోని వాళ్ళు సైతం ఇప్పుడు తెలుగు సినిమా దర్శకులతో( Telugu Directors ) ఒక్క సినిమా అయినా చేయాలని అనుకుంటున్నారు అంటే మన తెలుగు వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగారో మనం అర్థం చేసుకోవచ్చు…
.