బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్( Jabardasth ) కార్యక్రమం ఒకటి అయితే ఇటీవల కాలంలో ఈ కార్యక్రమం కాస్త విమర్శలను ఎదుర్కొంటుంది.ఈ కార్యక్రమం ప్రారంభంలో ఇందులో సందడి చేసిన కమెడియన్స్ ప్రస్తుతం పూర్తిగా ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటూ వెండితెరపై బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే కొత్త ఆర్టిస్టులు జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.ఇక ఈ కార్యక్రమానికి మొదట్లో రోజా నాగబాబు జడ్జిలుగా వ్యవహరించేవారు.
ఇక ప్రస్తుతం ఈ కార్యక్రమానికి శివాజీ అలాగే ఇంద్రజ ( Indraja ) జడ్జిలుగా వ్యవహరిస్తూ ఉన్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో జబర్దస్త్ కార్యక్రమం తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొంటుంది.ఇందులో పాల్గొని కమెడియన్లు పెద్ద ఎత్తున డబుల్ మీనింగ్ డైలాగులు( Double Meaning Dialogues ) చెప్పడంతో చాలామంది విమర్శలు కురిపిస్తున్నారు అయితే వీరు అక్కడున్న జడ్జిల మీద అలాగే యాంకర్ల మీద ఇంకా రాజకీయ నాయకులు మీద కూడా డబల్ మీనింగ్ డైలాగులు పేలుస్తూ విమర్శలను ఎదుర్కొంటూ ఉంటారు.అయితే తాజాగా జడ్జ్ ఇంద్రజ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ ఇంద్రజను ప్రశ్నిస్తూ ఇటీవల కాలంలో జబర్దస్త్ కార్యక్రమంలో డబల్ మీనింగ్ జోక్స్ డోస్ కాస్త పెరిగింది కదా అంటూ యాంకర్ ప్రశ్నించడంతో ఇంద్రజ సమాధానం చెబుతూ… జబర్దస్త్ కార్యక్రమంలో డబుల్ మీనింగ్ జోక్స్ ఎక్కువగా ఉన్నాయి చివరికి నాపై కూడా ఇలా డబల్ మీనింగ్ జోక్స్ వేస్తూ ఉంటారని ఈమె తెలిపారు.కానీ షో సక్సెస్ కదా ఇలాంటివి ఇప్పుడు ప్రతిచోట ఉన్నాయి.ఓటీటీ కంటెంట్, సినిమాలలో కూడా ఇప్పుడు డబల్ మీనింగ్ జోక్స్ ఉన్నాయి కదా ఇలాంటివన్నీ కామన్ అంటూ ఈమె సమర్థిస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.