ఇటీవల కాలంలో ఏదైనా ఒక సినిమా మంచి సక్సెస్ అయితే తప్పనిసరిగా ఆ సినిమాకు సీక్వెల్ ( Sequel ) సినిమాని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది.
ఈ క్రమంలోనే రవితేజ శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ధమాకా. డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా తర్వాత రవితేజ పలు చిత్రాలలో నటించినప్పటికీ కూడా పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు.

ఇక ప్రస్తుతం ఈయన తిరిగి శ్రీ లీలతో మరో సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాకు మాస్ జాతర( Mass Jathara ) అనే టైటిల్ కూడా ఖరారు చేశారు.అయితే ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
ఇదిలా ఉండగా తాజాగా ధమాకా( Dhamaka ) సినిమా సీక్వెల్ గురించి డైరెక్టర్ త్రినాథ్ రావు( Director Trinadha Rao ) మజాకా సినిమా ప్రమోషన్లలో భాగంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.సందీప్ కిషన్ రీతు వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన మజాకా సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం కూడా ఉండబోతుందని ఆ సినిమాకు డబుల్ మజాకా( Double Mazaka ) అనే టైటిల్ కూడా పెట్టబోతున్నామని తెలిపారు.

ఇక రవితేజకు ( Raviteja ) కూడా ఒక అద్భుతమైన కథను వివరించాము ఆ సినిమా చేయటానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.ఇక ఈ చిత్రానికి డబల్ ధమాకా( Double Dhamaka ) అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు డైరెక్టర్ వెల్లడించారు.ఇలా ధమాకా సీక్వెల్ సినిమా కూడా రాబోతుందని తెలియడంతో రవితేజ ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మరి ఇందులో హీరోయిన్ గా శ్రీ లీల నటిస్తుందా లేక మరేవరైనా నటిస్తారా అనే వివరాలు తెలియాల్సి ఉంది
.






