నేషనల్ క్రష్ రష్మిక మందన్న ( Rashmika Mandanna ) ప్రస్తుతం వరుస సినిమా సక్సెస్ అందుకొంటూ కెరియర్ పరంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి కిరిక్ పార్టీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అయ్యారు.
అనంతరం తెలుగులో కూడా వరుస సినిమా అవకాశాలను అందుకుంటు మంచి సక్సెస్ అందుకున్న రష్మిక అల్లు అర్జున్ సరసన పుష్ప ( Pushpa ) సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తున్నాయి.

ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో యానిమల్ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్న రష్మిక తాజాగా మరో హిట్ చిత్రాన్ని కూడా తన ఖాతాలో వేసుకున్నారు చత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ జీవిత కథ ఆధారంగా ఛావా( Chhaava ) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో విక్కీ కౌశల్( Vicky Kaushal ) హీరోగా నటించిన రష్మిక హీరోయిన్గా నటించారు ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో రష్మిక ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా మంచి విజయం కావడంతో ఈమెకు బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వస్తాయని స్పష్టం అవుతుంది.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న రష్మిక మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.తాజాగా సోషల్ మీడియా వేదికగా పింక్ కలర్ ట్రెడిషనల్ దుస్తులను ధరించి ఉన్న ఫోటోలను ఈమె షేర్ చేశారు.ఇక ఈ ఫోటోలను షేర్ చేసిన రష్మిక… జీవితం ఎప్పుడూ కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటాను కేవలం సంతోషంగా, ప్రకాశవంతంగా, ఉల్లాసభరితంగా అలాగే సరదాగా మీరు కూడా దీనిని అంగీకరిస్తారా అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.







