మెగా కోడలు ఉపాసన( Upasana ) ఒకవైపు అపోలో హాస్పిటల్ వ్యవహారాలన్నింటిని చక్కబెడుతూనే మరోవైపు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉంటున్న ఈమె ఒక భార్యగా ఒక తల్లిగా తన కుటుంబ బాధ్యతలను కూడా ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారు.
ఉపాసన తణుకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా అమ్మ నాన్న పెళ్లిరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

ఉపాసన తల్లిదండ్రులు( Upasana Parents ) 40వ పెళ్లిరోజులు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ పెళ్లి రోజు( Wedding Day ) వేడుకలకు సంబంధించిన వీడియోని అలాగే ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.40 సంవత్సరాల మీ ప్రేమను, కలయికను జరుపుకుంటున్నాము.వార్షికోత్సవ శుభాకాంక్షలు, లవ్ యు, అమ్మ & నాన్న.మేము నిజంగా ఆశీర్వదించబడ్డాము అంటూ ఉపాసన ఈ వీడియోని షేర్ చేయడం తేది కాస్త వైరల్ అయింది.

ఇక ఈ వేడుకలలో భాగంగా ఉపాసన కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని సందడి చేశారు.ఇక రామ్ చరణ్( Ram Charan ) అలాగే క్లిన్ కారా( Klin Kaara ) ఈ వేడుకలలో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించారు అయితే ఇక్కడ కూడా తమ కూతురి ఫేస్ కనపడకుండా ఉపాసన చరణ్ జాగ్రత్త పడ్డారు.ఇక చరణ్ విషయానికి వస్తే ఈయన ఇటీవల గేమ్ చేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.ప్రస్తుతం ఈయన బుచ్చిబాబు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.







