బుల్లితెర స్టార్ సింగర్స్ లో ఒకరైన షణ్ముఖ్ ప్రియా.తన 4 ఏళ్ల వయసునుండే సంగీతాన్ని నమిలి మింగేసినట్టుగా తన పాటతో అందరిని ఆశ్చర్య పరిచింది.
రాష్ట్ర, జాతీయ, ఆంతర్జాతీయ స్థాయిలో జరిగిన పాటల పోటీల్లో తన సత్తా చాటి ఇండియా లెవెల్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది.ఈమె పాట వినటానికి వేలమంది ఎదురు చూస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇక షణ్ముఖ ప్రియా అమ్మానాన్నల గురించి మాట్లాడుకుంటే.ప్రియా నాన్న శ్రీనివాస కుమార్, తల్లి రత్నమాల వీళ్లిద్దరు కూడా శాస్త్రీయ సంగీతంలో ఎమ్ఏ పట్టాలు పొందారు.
ప్రియా నాన్న శ్రీనివాసు కుమార్ గారు అయితే వయోలిన్, వీణ వాయించడంలో మంచి దిట్ట.అందుకే వీళ్లిద్దరి వారసత్వంగా షణ్ముఖ కూడా అతి చిన్న వయసులోనే కూను రాగాలు తీస్తూ ఉండేదట.
అది గమనించిన తల్లిదండ్రులు ఆమెకి సంగీతంలో మెళుకువలు నేర్పించారు.షణ్ముకకి అమ్మానాన్నలే గురువులయ్యారు.
అదే ఆమెని ది గ్రేట్ సింగర్ గా నిలబెట్టాయి.
అలా సంగీతంలో ఏలనేని ప్రావిణ్యం సంపాదించిన షణ్ముఖ జీ తెలుగు చానల్ 2018 లో నిర్వహించిన జీ సరిగమ లిటిల్ ఛాంప్‌లో విన్నర్‌గా నిలవడంతో ఆమె సత్తా ఏమిటో అందరికి తెలిసిపోయింది.
ఇక మా టీవీలో ప్రసారమయ్యే సూపర్‌సింగర్ 4లో ఫైనలిస్ట్ గా కూడా నిలిచింది.అలాగే 2010 లో తమిళ్ చానల్ స్టార్ విజయ్‌లో, తమిళ్ జూనియర్ సూపర్‌స్టార్ టైటిల్ విజేతగా నిలవడంతో పాటు కర్నాటక, కేరళ, తమిళనాడు చిన్నారులకు నిర్వహించిన జూనియర్ సూపర్‌స్టార్ సింగర్ పోటీల్లో విన్ అయ్యింది.
అసలు ఎలాంటి రాగమైన ఎలాంటి బాషలోనైనా ఒక్కసారి తెలుసుకుంటే అలవోకగా పాడగలగడం షణ్ముఖకే సొంతం.అయితే షణ్ముఖ పాటల్లో పడిపోయి తన చదవును మాత్రం ఎప్పుడు పక్కన పెట్టలేదు.ఆమె సింగర్ గా రాణిస్తూనే బాగా చదవుకుంటుంది.ఎప్పటికైనా CA అవ్వాలనేది ఆమె ఆశయం అని చెప్తుంది.
ఇక షణ్ముఖ కేవలం సినిమా పాటలు జానపద గీతాలే కాదు ఉర్దూ గజల్స్ ను కూడా అదిరిపోయేలా పాడుతుంది.అందుకే ఆమె ఘనత కేవలం దక్షణ భారతదేశానికే పరిమితం కాలేదు.టీవీలో ది వాయిస్ అఫ్ కిడ్స్ లో పాల్గొని దేశవ్యాప్తంగా అందరికి సుపరిచితురాలైంది.ఇక హిందీలో జీటీవీ సరిగమప లిటిల్ చాంప్స్ లో కూడా పాడి దేశవ్యాప్తంగా పేరు సంపాదించింది.
అయితే అలా విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న షణ్ముక ఇప్పుడు ఇండియన్ ఐడల్‌పై కన్నేసింది.దీంతో ఇప్పుడు అందరి దృష్టీ షణ్ముకపైనే ఉంది.షణ్ముక గెలిచి తీరుతుందని ఆమె అభిమానులు కలలుకంటున్నారు.ఎందుకంటే మన ఇండియాకి వరల్డ్ కప్ ఎంత ఇంపార్టెంటో సింగర్ గా కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇండియన్ ఐడల్ కూడా అంతే ఇంపార్టెంట్.
అందులో ఎలాగైనా విజయం సాధించాలని సింగెర్స్ కలలుకంటారు అయితే ఇప్పటికే మన కొంతమంది తెలుగు వారు ఇండియన్ ఐడల్ గెలిచి తమ సత్తా చాటారు.ఇప్పుడు కొత్తగా ఇండియన్ ఐడల్ 12 రేసులో ఉన్న అమ్మాయి షణ్ముక ప్రియ.
సంగీత ప్రియులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఈ ఇండియన్ ఐడల్‌లో విజయం సాధించాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది.నాలుగు సంవత్సరాల వయస్సులోనే సంగీతంపై అంత పట్టు సాధించి ఇంత ఎదిగిన షణ్ముఖ ఎలాగైనా ఈ టైటిల్ గెలవాలని అందరూ కోరుకుంటున్నారు.