యోని ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?

జననాంగాలు చాలా సున్నితమైనవి.గాలి ఎక్కువగా ఆడే ప్రదేశం కాదు కాబట్టి, ఏదైనా ఇంఫెక్షన్ గాని వస్తే త్వరగా కోలుకోవడం కూడా కష్టం.

 How To Keep Your Vagina Healthy?-TeluguStop.com

శరీర నిర్మాణం వలన, ఈ సమస్య పురుషుల కంటే మహిళలకే ఎక్కువ.కాబట్టి యోనిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అమ్మాయిలు.

మరి యోనిని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి?

* సబ్బు ఎంపికలో జాగ్రత్త వహించాలి.నిజానికి యోనిపై సబ్బు వాడకపోవడమే మంచిది.

కాని మన లైఫ్ స్టయిల్ లో సబ్బు విడదీయలేని భాగం అయిపోయినందు వల్ల, ఎలాంటి సబ్బు వాడాలో డాక్టర్ ని అడిగి తెలుసుకోండి.

* డౌచింగ్ వద్దు.

మార్కెట్లో దొరికే క్లీన్సర్ ని యోని లోపల ప్రయోగించవద్దు.వాస్తవానికి, సొంతంగా శుభ్రపరుచుకునే శక్తి యోనికి ఉంది.

* కాటన్ అండర్ వియర్స్ వాడాలి.ఎందుకంటే మాయ్శ్చర్ ని అబ్జర్వ్ చేయగలదు కాటన్.

* ప్యాడ్స్ గా ఎన్నుకోని వాడండి.ముఖ్యంగా పీరియడ్స్ లో.అలాగే ఎలాంటి ఇంఫెక్షన్స్ ని ఆ భాగంలో పెంచి పోషించవద్దు.ఏమాత్రం ఇబ్బంది ఎదురైనా, దాన్ని వెంటనే దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి.

* లూబ్రికేంట్స్ కి దూరంగా ఉండాలి.అలాగే హస్తప్రయోగం దేనితో పడితే దానితో చేసుకోకూడదు.

* ఆహారపు అలవాట్లు సరిగా ఉండాలి.న్యూట్రింట్స్ ఎక్కువగా లభించే ఆహారం, ముఖ్యంగా యోగ్ రట్స్, క్రాన్ బెర్ర జ్యూస్ యోనిని ఇంఫెక్షన్స్ నుంచి కాపాడుతాయి.

* సెక్స్ లో కండోమ్స్ వాడటం, సెక్స్ ముగిసిన వెంటనే స్నానం చేయడం, గోరువెచ్చని నీటితో యోని భాగాన్ని శుభ్రపరుచుకోవడం చాలా ముఖ్యమైన విషయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube