చాలామంది తిరుమల( Tirumala ) కాలినడకన వెళ్లిన ఎలాంటి కష్టం తీరలేదని అనుకుంటూ ఉంటారు.సామాన్యంగా తిరుమల లాంటి యాత్రలు చేసినప్పుడు మనం కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.
అవి చేయకుండా మనం కొన్ని తప్పులు కూడా చేస్తూ ఉంటాం.కాబట్టి కోరుకున్నది అసలు జరగదు.
యాత్ర ఫలితం కూడా లభించదు.తిరుమలలో మనం చేయకూడని కొన్ని తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తిరుమలలో చాలామంది చేసే తప్పులలో మొదటి తప్పు ఏంటంటే గురువు అయిన వరాహ స్వామిని( Varaha Swamy ) దర్శించుకోకుండానే నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్లిపోతారు.అయితే ఇది చాలా పెద్ద తప్పు అని చెప్పాలి.
అసలు తిరుమల వెంకటేశ్వర క్షేత్రం కాదు.వరాహ క్షేత్రం.
వరాహ స్వామి శ్రీవారి దగ్గర ఉండటానికి అనుమతి తీసుకుంటున్నప్పుడు శ్రీవారికి మూడు ప్రామాణాలు చేస్తారు.మొదటి పూజ, మొదటి నైవేద్యం, మొదటి దర్శనం ఈ మూడు కూడా నీకు ఇస్తాను అని వాగ్దానం చేసి ఒక ప్రమాణ పత్రం కూడా రాసిస్తారు.
ఇప్పటికీ ఆ ప్రమాణ పత్రం తిరుమల, తిరుపతి దేవస్థానం మ్యూజియంలో ఉంది.అయితే వరాహ స్వామి విగ్రహం కూడా దేవాలయంలోనే ఉండేది.ఆ తర్వాత దానికి మ్యూజియంకు తరలించడం జరిగింది.అందులో స్వామి చెప్పిన మొదటి రెండు పనులను అర్చకులు ఇప్పటికీ కూడా చేస్తున్నారు.
మొదటి పూజ రోజు వరాహ స్వామికి చేస్తారు.
అలాగే మొదటి నైవేద్యం కూడా వరాహ స్వామికి పెట్టిన తర్వాతే శ్రీవారికి పెడతారు.కానీ మొదటి దర్శనం పాటించాల్సింది మాత్రం భక్తులే.కానీ భక్తులు( Tirumala Devotees ) మాత్రం ఇలా పాటించకుండా నేరుగా శ్రీవారి వద్దకు వెళ్ళిపోతున్నారు.
ఇలా తిరుమలలో తెలిసో తెలియకో చేసే రెండు తప్పులు ఏంటంటే కొందరు లౌకిక సుఖాల కోసం వెళుతూ ఉంటారు.పొరపాటున కూడా ప్రాపంచిక సుఖాలను అర్పించేందుకు అక్కడికి వెళ్ళకూడదు.
అంటే హనీమూన్ ట్రిప్స్, బోర్ గా ఉందని సరదాగా ట్రిప్స్ కి వెళ్లడానికి ఇలా వెళ్ళకూడదు.ఇది మహా పుణ్యక్షేత్రం.
కాబట్టి పెద్దలు కూడా శాస్త్రంలో ఒక నియమం పెట్టారు.వివాహమైతే ఆరు నెలల పాటు ఎలాంటి పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్లకూడదు.అయితే పెళ్లైన కొన్ని నెలలపాటు ఆ వ్యామోహాన్ని తీర్చుకోవడానికి వెళ్తారనే ఉద్దేశంతో ఈ నియమం పెట్టడం జరిగింది.శ్రీవారికి పద్మావతితో వివాహమయ్యాక కూడా ఆరు నెలల పాటు ఆయన కొండకి రాలేదు.
కొండ కింద ఆగస్త్య మహర్షి ఆశ్రమం ఉంటే అక్కడే ఉండి ఆరు నెలలు అయిపోయాక కొండమీదకి వచ్చారు.కాబట్టి స్వామివారే పాటించినప్పుడు మనం కూడా పాటించాల్సిందే.
DEVOTIONAL