శాకుంతలం సినిమాకు ఆస్కార్ అవార్డ్.. ఆ పార్టీ ట్రోలింగ్ మామూలుగా లేదుగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో( Tollywood Industry ) విభిన్నమైన కథలతో సినిమాలను తెరకెక్కించే దర్శకులలో గుణశేఖర్( Gunasekar ) ఒకరు.ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు అయితే బ్లాక్ బస్టర్ అవుతాయని లేకపోతే డిజాస్టర్ అవుతాయని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

 Oscar Award For Shakuntalam Movie Details Here Goes Viral In Social Media , Rudr-TeluguStop.com

గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన కొన్ని సినిమాలు నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. సైనికుడు, వరుడు, నిప్పు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన నేపథ్యంలో గుణశేఖర్ తో సినిమాలు నిర్మించడానికి నిర్మాతలెవరూ ముందుకు రాలేదు.

రుద్రమదేవి సినిమా( Rudramadevi movie ) నుంచి గుణశేఖర్ ఒకవైపు డైరెక్టర్ గా కెరీర్ ను కొనసాగిస్తూనే మరోవైపు సినిమాలను సొంతంగా నిర్మిస్తున్నారు.అయితే శాకుంతలం సినిమాకు( Sakunthalam movie ) సంబంధించి గుణశేఖర్ పై ఊహించని స్థాయిలో ట్రోల్స్ వస్తున్నాయి.గుణశేఖర్ చెప్పిన మాటలకు ఈ సినిమాకు పొంతన లేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.2023 సంవత్సరంలో ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచిన సినిమాగా శాకుంతలం వార్తల్లో నిలుస్తోంది.

తొలిరోజు ఈ సినిమా 2.20 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు సాధించగా ఫుల్ రన్ లో ఈ సినిమా 5 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడం కష్టమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన అభిమానులు ఈ సినిమాను దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా( Gautamiputra Satakarni movie )కు వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చి రుద్రమదేవి సినిమాకు ఇవ్వకపోవడం గురించి గుణశేఖర్ గతంలో బహిరంగ లేఖ రాశారు.

ప్రశ్నించడం తప్పా అంటూ అప్పుడు ఆయన లేఖ రాయగా టీడీపీ ఫ్యాన్స్ శాకుంతలం సినిమాకు ఆస్కార్ అవార్డ్ ఇవ్వాలని ఈ సినిమా కళాఖండం అని సెటైరికల్ గా కామెంట్లు చెస్తున్నారు.శాకుంతలం మూవీకి ఆస్కార్ అవార్డ్ రాకపోతే కూడా “ప్రశ్నించడం తప్పా” అని ఆస్కార్ కమిటీకి ఇంగ్లీష్ లో గుణశేఖర్ లెటర్ రాయాలని టీడీపీ సానుభూతిపరులు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube