పోషకాలతో నిండిన అత్యంత ఆరోగ్యకరమైన పండు దానిమ్మ.( Pomegranate ) విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా నిండి ఉండటం వల్ల దానిమ్మ ఆరోగ్యానికి వరమనే చెప్పుకోవచ్చు.హృదయ ఆరోగ్యానికి దానిమ్మ చాలా మేలు చేస్తుంది.ఐరన్ మెండుగా ఉండటం వల్ల దానిమ్మ హెమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది.అలసట, నీరసాన్ని దూరం చేసి శరీరానికి శక్తిని ఇస్తుంది.అలాగే దానిమ్మ పురుషుల్లో స్పెర్మ్ కౌంట్, నాణ్యతను మెరుగుపరుస్తుంది.
మహిళల్లో హార్మోన్ల సమతుల్యతకు తోడ్పడి ఫెర్టిలిటీ రేటును పెంచుతుంది.
క్యాన్సర్ నివారణకు, మెదడు పనితీరును మెరుగుపరిచేందుకు, చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతంగా మార్చేందుకు దానిమ్మి ఎంతగానో తోడ్పడుతుంది.
అయితే ఆరోగ్యానికి మంచిదే అయినా కూడా కొందరు మాత్రం దానిమ్మను తినకపోవడమే బెటర్.మరి ఆ కొందరు ఎవరు? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

తక్కువ రక్తపోటుతో బాధపడుతూ లో-బీపీ( Low BP ) మందులు వాడుతున్న వారు దానిమ్మ పండ్లకు దూరంగా ఉండాలి.ఎందుకంటే, దానిమ్మ రక్తపోటును తగ్గించే గుణం కలిగి ఉంటుంది, తక్కువ రక్తపోటు ఉన్నవారికి ఇది ప్రమాదకరం.అలాగే దానిమ్మలో సహజ షుగర్ ఎక్కువగా ఉండటంతో, రక్తంలో చక్కెర స్థాయిని పెంచవచ్చు.కాబట్టి, మధుమేహం( Diabetes ) ఉన్నవారు దానిమ్మను ఎవైడ్ చేయాలి.లేదా పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి.

అసిడిటీ, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలతో తరచూ బాధపడేవారు దానిమ్మను తింటే అసౌకర్యం కలిగించవచ్చు.అలాంటివారు కూడా దానిమ్మను దూరం పెట్టాలి.అలాగే శస్త్రచికిత్సకు ముందు లేదా తర్వాత రక్తం గడ్డకట్టే విధానాన్ని దానిమ్మ ప్రభావితం చేస్తుంది.
కాబట్టి సర్జరీకు కనీసం రెండు వారాల ముందు దానిమ్మను తినడం మానేయాలి.ఇక దానిమ్మపండు అలెర్జీలు అసాధారణం, అయితే అవి కొంతమందిలో సంభవించవచ్చు.దానిమ్మ పండు తిన్నప్పుడు వాపు, దురద మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే దానిమ్మిను తినడం మానేయాలి.