ఈ ప్రకృతి మనకు వరంగా ఎన్నో రకాల పండ్లను ప్రసాదించింది.అయితే వాటిలో కొన్ని పండ్లు ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా పెంచుతాయి.
ఈ జాబితాలో మొదట చెప్పుకోవాల్సింది దానిమ్మ.విటమిన్స్, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే దానిమ్మ ఆరోగ్యానికే కాదు చర్మానికి మెరుపు తీసుకురావడానికి కూడా తోడ్పడుతుంది.
ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ దానిమ్మ గింజల రసం, వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) మరియు వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టి ఆపై వాటర్ తో కడిగేయాలి.
ఇలా తరచూ చేయడం వల్ల చర్మం కాంతివంతంగా తెల్లగా మారుతుంది.మొటిమలు తొలగిపోతాయి.

అలాగే విటమిన్ సి రిచ్ గా ఉండే ఆరెంజ్ పండు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడుతుంది.అలాగే చర్మంపై మొండి మచ్చలను తగ్గించడానికి సైతం హెల్ప్ చేస్తుంది.ఒక బౌల్ లో వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, చిటికెడు పసుపు మరియు సరిపడా ఆరెంజ్ జ్యూస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా అప్లై చేసి ఆరబెట్టుకోవాలి.
పూర్తిగా డ్రై అయ్యాక వాటర్ తో వాష్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ విధంగా చేస్తే ముఖంపై ఎలాంటి మొండి మచ్చలు ఉన్న తగ్గుముఖం పడతాయి.
పిగ్మెంటేషన్ సమస్య సైతం దూరం అవుతుంది.చర్మం తాజాగా యవ్వనంగా మెరుస్తుంది.

ఇక బొప్పాయి పండు స్కిన్ ఏజింగ్ ( Papaya fruit )ను ఆలస్యం చేయడంలో చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.బొప్పాయి పండు ప్యూరీలో కొద్దిగా బాదం నూనె కలిపి ముఖానికి అప్లై చేసుకుని ఐదు నుంచి పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఆపై వాటర్ తో కడిగేయాలి.ఇలా తరచూ చేస్తే వయసు పైబడినా మీరు మాత్రం యవ్వనంగా మెరిసిపోతారు.ముడతలు, చారలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య ఛాయలు మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.






