తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో అద్భుతమైన కామెడీ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించినటువంటి వారిలో నటుడు వేణు ( Venu ) ఒకరు.ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచే సక్సెస్ అందుకున్నటువంటి ఈయన అనంతరం సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
ఇలా కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈయనకు బోయపాటి శ్రీను ( Boyapati Sreenu ) దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం వచ్చింది.అయితే ఎన్టీఆర్( NTR )హీరోగా ఈ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది.
ఈ సినిమా ద్వారా మంచి కంబ్యాక్ ఇవ్వాలనుకున్నటువంటి ఈయనకు తీవ్ర నిరాశ ఎదురయింది.
ఇలా ఈ సినిమా తర్వాత కొంతకాలం పాటు ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉన్నటువంటి వేణుకి తిరిగి రవితేజ ( Raviteja ) హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాల్లో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించే అవకాశం వచ్చింది అయితే ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈయన నటించిన ఈ పాత్రకు కూడా గుర్తింపు లభించలేదు.తాజాగా ఒక వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సినిమా గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.దమ్ము( Dhammu ) సినిమాలో ఈయన పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత లేదు ఇక చివరికి వేణు చేసిన పాత్ర చనిపోవడంతో ఈయనకు పెద్దగా గుర్తింపు కూడా రాలేదని చెప్పాలి.ఈ విషయం గురించి వేణు మాట్లాడుతూ బోయపాటి శ్రీను గారు దమ్ము కథ అసలు తనకు చెప్పలేదని ఒకవేళ సినిమా కథ కనుక నాకు చెప్పి ఉంటే నేను ఈ సినిమాలో నటించే వాడిని కాదు అంటూ తెలియచేశారు.
బోయపాటి గారు నన్ను సంప్రదించినప్పుడు ఈ సినిమాలో నా పాత్ర ఎలా ఉంటుందనే విషయాన్ని తెలియచేయకుండా కేవలం షోలే సినిమాలో అమితాబ్ పాత్ర ఎలా ఉంటుందో అలాగే ఉంటుందని మాత్రమే చెప్పారు.దాంతో ఈ సినిమాకు కమిట్ అయ్యానని సినిమా కథ కనుక చెప్పి ఉంటే అసలు ఈ సినిమా చేసే వాడిని కాదు అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.