ఏపీలోని టీడీపీ దీక్షలపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు.టీడీపీ అధినేత చంద్రబాబు కాదు ఎవరైనా ఈ రోజు దీక్ష చేయవచ్చని చెప్పారు.
అయితే దీక్ష చేసే ముందు ఎంతవరకు మనకు అర్హత ఉందో చూసుకోవాలని తెలిపారు.నారా భువనేశ్వరి బస్సు యాత్ర కాకపోతే హెలికాప్టర్ యాత్ర చేసుకోమనండన్న స్పీకర్ తమ్మినేని అది వారి ఇష్టమని పేర్కొన్నారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆరు నెలలు ఓపికగా ఉండాలని సూచించారు.వచ్చే ఎన్నికల్లో ప్రజలు వారికి ఊహించని తీర్పు ఇస్తారని తెలిపారు.