ఇవి పాటిస్తే ఎలాంటి మోకాళ్ళ నొప్పులు అయినా దెబ్బకు పరార్ అవ్వడం ఖాయం!

మోకాళ్ళ నొప్పు(knee pain )లతో బాగా సతమతం అవుతున్నారా.? వీటి కారణంగా ఎక్కువ సేపు నిలబడాలన్నా, నడవాలన్నా కష్టంగా అనిపిస్తుందా.? మోకాళ్ళ నొప్పుల నుండి విముక్తి పొందడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా.? హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ మందులు వాడుతున్నారా.? అయినా సరే మోకాళ్ళ నొప్పులు తగ్గడం లేదా.? డోంట్ వర్రీ ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను పాటిస్తే ఎలాంటి మోకాళ్ళ నొప్పులు అయినా సరే సహజంగానే త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.మరి ఇంకెందుకు లేటు ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

 Best Ways To Get Rid Of Knee Pain Naturally! Knee Pain, Knee Pain Relief Remedie-TeluguStop.com

తులసి టీ( Tulsi Tea ).మోకాళ్ల నొప్పుల నుంచి బయటపడేందుకు అద్భుతంగా సహాయపడుతుంది.మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నవారు రోజుకు ఒక కప్పు తులసి టీ ని తాగితే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అలాగే అల్లం నూనె కూడా మోకాళ్ళ నొప్పుల‌ నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.అందుకోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు కొబ్బరి నూనె( Coconut Oil ) వేసుకోవాలి.

అలాగే ఒక కప్పు అల్లం తురుమును వేసి పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు మరిగించాలి.

Telugu Basil Tea, Bone, Tips, Knee Pain, Turmeric Milk-Telugu Health

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ ను మోకాళ్ళకు అప్లై చేసి బాగా మసాజ్ చేసుకోవాలి.ఈ ఆయిల్ అద్భుతమైన పెయిన్ కిల్లర్ గా పని చేస్తుంది.

మోకాళ్ళ నొప్పుల‌తో బాధపడేవారు ప్రతిరోజు నైట్ నిద్రించేముందు ఒక గ్లాసు ఆవు పాలల్లో చిటికెడు పసుపు వేసి మరిగించి తీసుకోవాలి.

Telugu Basil Tea, Bone, Tips, Knee Pain, Turmeric Milk-Telugu Health

ఇలా చేస్తే ఎముకల సాంద్రత పెరుగుతుంది.మోకాళ్ళ నొప్పులు దూరం అవుతాయి.మోకాళ్ళ నొప్పుల కారణంతో కొందరు ఎప్పుడూ కుర్చీకే పరిమితం అవుతుంటారు.

కానీ రోజుకు 20 నిమిషాలు అయినా వాకింగ్ చేయడానికి ప్రయత్నించాలి.ఇక‌ నట్స్, ఆకుకూరలు, పన్నీర్, చేపలు, నువ్వులు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పెరుగు, గుడ్లు వంటి ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి.

ఇవి ఎముకలను దృఢపరుస్తాయి.మోకాళ్ల నొప్పుల నుంచి బయటపడేందుకు ఎంతగానో సహాయపడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube