సాధారణంగా కొందరి జుట్టు తరచూ చిట్లి పోతూ ఉంటుంది.అందుకు కారణాలు అనేకం.
రెగ్యులర్ గా షాంపూ చేసుకోవడం, పోషకాల కొరత, హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను అధికంగా వినియోగించడం, రసాయనాలు ఎక్కువగా ఉండే జుట్టు ఉత్పత్తులను వాడటం తదితర కారణాల వల్ల జుట్టు తరచూ చిట్లిపోతూ ఉంటుంది.ఇలా జరగడం వల్ల హెయిర్ గ్రోత్ ఆగిపోతుంది.
ఈ క్రమంలోనే చిట్లిన జుట్టు సమస్యను వదిలించుకోవడం కోసం నానా తిప్పలు పడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీని కనుక పాటిస్తే చిట్లిన జుట్టును సహజంగానే రిపేర్ చేసుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పవర్ ఫుల్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు ఫ్రెష్ పెరుగును వేసుకోవాలి.అలాగే ఒక ఫుల్ ఎగ్ ను బ్రేక్ చేసి వేసుకోవాలి.చివరిగా రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారంలో రెండంటే రెండు సార్లు ఈ పవర్ ఫుల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే చిట్లిన జుట్టు సహజంగానే రిపేర్ అవుతుంది.అదే సమయంలో జుట్టు కుదుళ్లు సూపర్ స్ట్రోంగ్ గా మారతాయి.
దాంతో జుట్టు రాలడం తగ్గుముఖం పడుతుంది.హెయిర్ గ్రోత్ సైతం అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.
ఫలితంగా జుట్టు ఒత్తుగా పొడుగ్గా మారుతుంది.







