కన్నడ సినిమా ఇండస్ట్రీ ద్వారా తొలుత హీరోయిన్ గా పరిచయమైన శ్రీ లీల తెలుగులో పెళ్లి సందడి సినిమాతో డెబ్యూ చేసిన విషయం మనందరికీ తెలిసిందే.అయితే చాలా మంది శ్రీ లీల కు గట్టి బ్యాక్ గ్రౌండ్ ఉందని అనుకుంటున్నారు.
ఎందుకంటే ఆమె కేజిఎఫ్ సినిమాల హీరో అయినటువంటి యష్ కి బంధువు అని ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.ఇక ప్రస్తుతం రవి తేజ సరసన ధమాకా చిత్రం లో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా,ఆ సినిమా సక్సెస్ సాధించడంతో అమే క్రేజ్ ఒక రేంజ్ లో ఉంది.
స్త్రీల మరి ఆమె నిజంగా యష్ కి బంధువా ? వారి మధ్య ఉన్న సంబంధం ఏంటి ? అనే విషయం ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బెంగళూరుకు చెందిన ఒక తెలుగు డాక్టర్ కి పుట్టింది శ్రీ లీల.ఆమె తండ్రి ఒక రాజకీయవేత్త.వారిద్దరూ విడిపోయిన తర్వాతే శ్రీ లీల జన్మించింది.
చిన్నప్పటి నుంచి శ్రీ లీల కర్ణాటకలోనే పెరిగింది తల్లిలాగా ఒక డాక్టర్ అవ్వాలని ఎంతో కష్టపడి చదివేది ప్రస్తుతం ఆమె ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది.ఇక సోషల్ మీడియాలో యష్ కుటుంబానికి శ్రీ లీల కుటుంబానికి మధ్య బంధుత్వం ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి.
ఈ విషయంపై ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీ లీల క్లారిటీ ఇచ్చింది.తనకు యష్ కుటుంబానికి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని చెప్పింది శ్రీ లీల.

కానీ యష్ భార్య రాధిక కు తన తల్లి డెలివరీ చేశారంటూ చెప్పుకొచ్చింది.వారి ఇద్దరి పిల్లలకి తన తల్లి డాక్టర్ కావడం వల్ల పురుడు పోసే అవకాశం వచ్చిందంటూ చెప్పుకొచ్చింది శ్రీ లీల.దానివల్ల యష్ కుటుంబంతో తమ కుటుంబానికి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని యష్ భార్య రాధికను తాను అక్క అంటూ పిలుస్తానని అలాగే యష్ ని బావ గారిగా సంబోధిస్తానంటూ చెప్పుకొచ్చింది.అంతేకానీ మా మధ్య ఎలాంటి రక్తసంబంధం లేదు అని కేవలం స్నేహం మాత్రమే అంటూ తెలిపింది.







