సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సినిమాల ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.అయితే ఈ సంక్రాంతి బరిలో విక్టరీ వెంకటేష్ ( Venkatesh ) నటించిన సంక్రాంతికి వస్తున్నామనే( Sankranthiki Vasthunnam Movie ) సినిమా కూడా విడుదల అయ్యి మంచి సక్సెస్ అందుకుంది.
అనిల్ రావిపూడి ( Anil Ravipudi ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్ మీనాక్షి చౌదరి( Meenakshi Chowdary ) ఐశ్వర్య రాజేష్( Aishwarya Rajesh ) హీరో హీరోయిన్లుగా నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో భాగంగా నటి ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ తన పాత్ర గురించి పలు విషయాలను బయటపెట్టారు.ఈ సినిమాలో భర్తను అమితంగా ప్రేమించే ఇల్లాలి పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటించారు అయితే ఈ పాత్రకు ఈమె ఫస్ట్ ఛాయిస్ కాదని ముగ్గురు ఈ సినిమాని రిజెక్ట్ చేసిన తర్వాత తాను సెలెక్ట్ అయ్యానని తెలిపారు.అయితే ఆ ముగ్గురు హీరోయిన్స్ ఎవరు అనే విషయాన్ని ఈమె చెప్పకపోయినా ఎందుకు రిజెక్ట్ చేశారనే విషయాన్ని మాత్రం వెల్లడించారు.
ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ భార్య పాత్రలోనూ అలాగే నలుగురు పిల్లల తల్లిగాను కనిపించి సందడి చేశారు.ఇలా నలుగురికి తల్లి పాత్రలో నటించాలి అంటే సాధారణంగా ఏ హీరోయిన్ కూడా సాహసం చేయరు.అలాంటి పాత్రలో ఒకసారి నటిస్తే తిరిగి తమకు అలాంటి పాత్రలే వస్తాయని తద్వారా కెరియర్ కోల్పోవలసి వస్తుందని చాలామంది భావిస్తారు అందుకే ఈ సినిమాని కూడా ముగ్గురు రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.
అయితే ఈ పాత్ర గురించి ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ పిల్లల తల్లిగా నటించడం అంటే రిస్క్ కాదని, మంచి అవకాశం అని తెలిపారు.ఈ సినిమాలో మరో హీరోయిన్గా నటించిన మీనాక్షి చౌదరి సైతం ఇదివరకే లక్కీ భాస్కర్ సినిమాలో ఓ కుర్రాడికి తల్లి పాత్రలో నటించిన ఆమె మాత్రం స్టార్ హీరోయిన్గా దూసుకుపోతోంది కదా అంటూ ఐశ్వర్య రాజేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.