నా లెగసీని కంటిన్యూ చేసేది అతనే.... బ్రహ్మానందం ఆసక్తికర వ్యాఖ్యలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో బ్రహ్మానందం ( Brahmanandam )  గారు ఒకరు.ఈయన ఒకప్పుడు ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాలు చేస్తూ తన కామెడీ ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.

 Bramhanandam Sensational Comments On Comedian Vennela Kishore , Vennela Kishore,-TeluguStop.com

ఇలా వందల సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన బ్రహ్మానందం ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి.కేవలం ప్రాధాన్యత ఉన్న పాత్రలలో మాత్రమే నటిస్తున్నారు అయితే ఆయనకు వయసు పైబడటంతో అవకాశాలు వచ్చిన నటించడం లేదని ఎన్నో సందర్భాలలో తెలియచేశారు.

Telugu Brahmanandam, Bramha Anandam, Bramhaanandam, Bramhanandam, Gautham, Venne

ఇకపోతే తాజాగా బ్రహ్మానందం తన కుమారుడు గౌతమ్( Gautham ) వెన్నెల కిషోర్( Vennela Kishore ) వంటి వారు ప్రధాన పాత్రలలో నటించినటువంటి చిత్రం బ్రహ్మ ఆనందం ( Brahma Anandam Movie ) .ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇటీవల టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మానందం పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.బ్రహ్మానందం ఇద్దరు కుమారులు ఉన్నప్పటికీ ఎవరూ కూడా హీరోలుగా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోలేకపోయారు.చిన్న కుమారుడు ఉద్యోగరీత్యా విదేశాలలో స్థిరపడగా పెద్ద కుమారుడు వ్యాపారాలను చూసుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు.

Telugu Brahmanandam, Bramha Anandam, Bramhaanandam, Bramhanandam, Gautham, Venne

ఈ క్రమంలోనే బ్రహ్మానందం ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ… ఈ సినిమాలో వెన్నెల కిషోర్ చాలా అద్భుతంగా నటించారు.కిషోర్ చాలా టాలెంటెడ్ యాక్టర్ అని, సినిమాలోని కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు అతని టైమింగ్, ఎక్స్ ప్రెషన్స్ కి మధ్యలోనే నవ్వొచ్చేదని ఆ టాలెంట్ అందరిలో ఉండదని తెలిపారు.నా తరువాత నా లెగసీని ఇండస్ట్రీలో కంటిన్యూస్ చేసేది కచ్చితంగా వెన్నెల కిషోర్ అంటూ ఈ సందర్భంగా వెన్నెల కిషోర్ గురించి బ్రహ్మానందం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

తనకి ఇద్దరు కుమారులు ఉన్నప్పటికీ తన లెగ్సీని మాత్రం మరో కమెడియన్ వెన్నెల కిషోర్ కంటిన్యూ చేస్తారని చెప్పడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube