వర్షాకాలం వచ్చేసింది.మిగిలిన సీజన్స్‌తో పోలిస్తే.
వర్షాకాలంలో అంటువ్యాధులతో పాటు అనేక సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి.అందులోనూ ఈ కాలంలో పాదాలు బాగా ఎఫెక్ట్ అవుతుంటాయి.
బురద, వర్షపు నీటిలో నడవడం వల్ల బాక్టీరియల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకి తామర, దురద, మంట, ఎరుపుదనం, పగుళ్లు ఇలా అనేక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే.ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కాలు పాటిస్తే.పాదాలను సంరక్షించుకోవచ్చు.ముందుగా ఒక టబ్‌లో గోరువెచ్చని నీరు తీసుకుని.అందులో ఉప్పు మరియు నిమ్మరసం కలపాలి.ఇప్పుడు పాదాలను పది నిమిషాల పాటు ఆ నీటిలో ఉచ్చి.అనంతరం క్లీన్ చేసుకోవాలి.మీరు బయటకు వెళ్లి వచ్చాక.
ఇలా చేస్తే పాదాలపై ఉన్న బాక్టీరియా నాశనం అవ్వడంతో పాటు.పాదాల నుంచి వచ్చే దుర్వాసన కూడా తగ్గుతుంది.

అలాగే వేపాకు కాళ్ళ పగుళ్ళను పూర్తిగా నివారించడానికి సహాయపడుతుంది.అదేవిధంగా, బాక్టీరియల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకకుండా రక్షిస్తుంది.కాబట్టి, కొన్ని వేపాకులు తీసుకుని పేస్ట్‌లా చేసుకోవాలి.ఈ పేస్ట్ చేసి పాదాలకు ప్యాక్‌లా వేసి.అరగంట తర్వాత క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల పదాల నొప్పి, దురద సమస్యలు కూడా తగ్గుతాయి.
ఇక ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు పాదాలకు ఆలివ్ ఆయిల్ అప్లై చేసి పడుకుంటే.ఇది మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.తద్వారా పదాలు మృదువుగా, అందంగా ఉంటాయి.అలాగే పసుపును కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్లను వదిలించుకోవడానికి సమర్థవంతంగా ఉపయోగపడుతుంది.
కాబట్టి, పసుపులో కొద్దిగా నిమ్మరసం కలిపి.పాదాలకు అప్లై చేయాలి.
పావు గంట తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల ఫంగస్‌ను నివారించవచ్చు.
.