నాగ వంశీది లక్కీ హ్యాండ్.... చిరు బ్లడ్ బ్యాంక్ పై సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్! 

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ( Suriya ) బుట్ట బొమ్మ పూజా హెగ్డే ( Pooja Hedge ) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం రెట్రో. ( Retro ) ఈ సినిమా మే 1వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 Actor Suriya Interesting Comments On Producer Nagavamshi And Chiru Blood Bank De-TeluguStop.com

ఇక హీరో సూర్యకు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అందుకే ఈయన సినిమాలు తెలుగులో కూడా విడుదలవుతూ ఉంటాయి.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను కూడా హైదరాబాదులో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ నాగ వంశీ ( Nagavamshi ) వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Telugu Agaram, Chiranjeevi, Nagavamshi, Pooja Hedge, Retro, Retro Pre, Suriya, V

ఈ కార్యక్రమంలో భాగంగా హీరో సూర్య మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు ముందుగా పహల్గాం ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ ఈ దాడిలో మరణించిన వారికి సంతాపం తెలిపారు.ఇక ఈ సినిమా గురించి మాట్లాడుతున్న కంటే కూడా ఎక్కువగా పూజ హెగ్డే ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వచ్చారని తెలిపారు.ఈ కార్యక్రమానికి పాల్గొన్న నాగ వంశీ గురించి సూర్య మాట్లాడుతూ…నాగవంశీ గారిది లక్కీ హ్యాండ్ అంటుంటారు.

ఆయనతో చేతులు కలపడం సంతోషంగా ఉంది.నా తదుపరి చిత్రాన్ని నాగవంశీ గారి నిర్మాణంలో, వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నాను.

ఈ సందర్భంగా ఈ విషయాన్ని అందరితో పంచుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.

Telugu Agaram, Chiranjeevi, Nagavamshi, Pooja Hedge, Retro, Retro Pre, Suriya, V

ఇక ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన విజయ్ దేవరకొండ సూర్య నడుపుతున్న ఆగరం ఫౌండేషన్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు అయితే ఇదే విషయం గురించి సూర్య మాట్లాడుతూ తాను ఆగరం ఫౌండేషన్ ప్రారంభించడానికి కారణం చిరంజీవి గారు ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ స్ఫూర్తి అని తెలిపారు.చిరంజీవి గారి స్ఫూర్తితోనే తాను కూడా ఆగరం ఫౌండేషన్ ప్రారంభించానని తెలిపారు.ఇక ఆగరం ఫౌండేషన్ కి ఎందరో తెలుగు వారు అండగా ఉన్నారు.

నాకు ఇన్నేళ్లుగా సపోర్ట్‌గా నిలుస్తూ వస్తున్న నా అభిమాన సోదరులకు, సోదరీమణులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని సూర్య తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube