సివిల్స్ సర్వీసెస్( Civil Services ) సాధించడం సులువైన విషయం కాదు.సివిల్స్ లక్ష్యాన్ని సాధిస్తే భవిష్యత్తు మారిపోతుందనే సంగతి తెలిసిందే.
సివిల్స్ లో 15వ ర్యాంక్ సాధించిన శ్రీకాకుళం వాసి బన్నా వెంకటేశ్( Banna Venkatesh ) సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.జిల్లాలోని అల్లాడపేట అనే చిన్న గ్రామానికి చెందిన వెంకటేశ్ గ్రామంలో పరిస్థితులను మార్చాలని భావించారు.
మాది రైతు కుటుంబం అని తల్లీదండ్రి చదువుకోకపోయినా వాళ్లకు చదువు విలువ తెలుసని వెంకటేశ్ చెప్పుకొచ్చారు.మా పిల్లలు బాగుపడాలని నలుగురికి సాయం చేసే స్థితిలో ఉండాలని నాన్న తపించేవారని వాళ్ల తాహతుకు మించి నన్ను, తమ్ముడిని చదివించారని ఆ స్పృహ మాకు ఉండటంతో కష్టపడి బాగా చదువుకునేవాళ్లం అని వెంకటేశ్ వెల్లడించడం గమనార్హం.

2019 సంవత్సరంలో ఎన్.ఐటీ తిరుచురాపల్లిలో బీటెక్ పూర్తి చేశానని అప్పటికీ మా పరిస్థితి అంతంత మాత్రమే అని పేర్కొన్నారు.ఫ్యామిలీకి అండగా ఉండాలని మొదట సాఫ్ట్ వేర్ జాబ్ లో చేరానని జీతం బాగున్నా సంతృప్తి ఉండకపోయేదని వెంకటేశ్ తెలిపారు.అప్పటికే నాకు సివిల్స్ పై అవగాహన ఉండటంతో 2021లో జాబ్ మానేశానని ఆయన చెప్పుకొచ్చారు.

2022లో తొలి ప్రయత్నం చేశానని ప్రిలిమ్స్( Prelims ) కూడా దాటలేదని నాలో ఏమేం లోపాలున్నాయో తెలుసుకొని సరిదిద్దుకొని పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యానని వెంకటేశ్ చెప్పుకొచ్చారు.రెండోసారి 467వ ర్యాంక్ సాధించానని ఐపీఎస్( IPS ) కు ఎంపికయ్యానని ఆయన అన్నారు.నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకుంటూనే ఐఏఎస్( IAS ) కు ప్రిపేర్ అయ్యానని వెంకటేశ్ పేర్కొన్నారు.ఐపీఎస్ నుంచి ఐఏఎస్ అయిన వెంకటేశ్ సక్సెస్ స్టోరీ ఎంతోమందిలో స్పూర్తి నింపుతోంది.
బన్న వెంకటేశ్ తన ప్రతిభను చాటుకుంటూ ప్రశంసలు అందుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.బన్న వెంకటేశ్ టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.