కొంత మంది దర్శకులకు, మరికొంత మంది హీరోలకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి.కొందరు దర్శకులు తమ ప్రతి సినిమాలో కొంత మంది నటులకు తప్పని సరిగా రోల్స్ ఇస్తే.
ఇంకొంత మంది హీరోలు కూడా తమ సినిమాల్లో కొంత మంది క్యారెక్టర్ ఆర్టిస్టులను అవకాశం వచ్చేలా చేస్తారు.పవన్ కల్యాణ్ ప్రతి సినిమాలో ఆలీ ఉన్నట్లే.
కొందరు దర్శకుల సినిమాల్లోనూ ఈ కాంబినేషన్ కొనసాగుతోంది.ఇంతకీ దర్శకులు మళ్లీ మళ్లీ రిపీట్ చేసే ఆ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరో ఇప్పుడు చూద్దాం!
రాజమౌళి:

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి.ఈయన తీసిని సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్స్.ఈయన తీసిని దాదాపు 90 శాతం సినిమాల్లో యాక్టర్ చంద్రశేఖర్ కనిపించాడు.రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి ఈగ సినిమా వరకు అన్ని సినిమాల్లో చంద్రశేఖర్ నటించాడు.
త్రివిక్రమ్ శ్రీనివాస్:

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాల్లోనూ ఇద్దరు నటులు రెగ్యులర్‌గా కనిపిస్తారు.వారిలో ఒకరు అమిత్ అంకిత్ కాగా.మరొకరు ప్రభు.
ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల్లో అంకిత్ కనిపించగా.అతడు, జల్సా, ఖలేజా, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల్లో ప్రభు నటించాడు.
హరీష్ శంకర్:

గబ్బర్ సింగ్‌తో ఇండస్ట్రీ హిట్ అందుకు హరీష్ శంకర్ సినిమాల్లోనూ ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు రిపీట్ అవుతాడు.ఆయనే రావు రమేష్.హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరెక్కిన మిరపకాయ్, గబ్బర్ సింగ్, రామయ్య వస్తావయ్యా, సుబ్రమణ్యం ఫర్ సేల్, దువ్వాడ జగన్నాథం సినిమాల్లో రావు రమేష్ నటించాడు.
పూరీ జగన్నాథ్:

ఈయన సినిమాల్లో ఎక్కువగా సుబ్బరాజు కనిపిస్తాడు.పూరీ దర్శకత్వంలో రూపొందిన అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, దేశముదురు, నేనింతే, గోలీమార్, దేవుడు చేసిన మనుషులు, బిజినెస్ మాన్, ఇద్దరమ్మాయిలతో సినిమాల్లో సుబ్బరాజు నటించాడు.తన క్యారెక్టర్‌తో ప్రేక్షకులను అలరించాడు.
శ్రీకాంత్ అడ్డాల:

ఈయన సినిమాల్లోనూ రావు రమేష్ తప్పకుండా కనిపిస్తాడు.శ్రీకాంత్ దర్శకత్వం వహించిన కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద, బ్రహ్మోత్సవం సినిమాల్లో రావు రమేష్ తన నటనతో ఆకట్టుకున్నాడు.
కృష్ణ వంశీ:

ఈయన సినిమాల్లో ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్టులు రెగ్యులర్‌గా కనిపించేవారు.అందులో ఒకరు బ్రహ్మాజీ కాగా.మరో దివంగత నటుడు ఆహుతి ప్రసాద్.కృష్ణ వంశీ సినిమా అంటే ఈ నటులిద్దరూ ఉంటారని గట్టినమ్మకం సినీ జనాలది.
రామ్ గోపాల్ వర్మ:

ఈయన సినిమాల్లో తనికెళ్ల భరణి ఎక్కువగా కనిపిస్తాడు.ఆర్జీవీ తెరకెక్కించిన శివ, రక్త చరిత్ర, అప్పలరాజు, రౌడీ చిత్రాల్లో ఆయన నటించాడు.