హిందూ ధర్మం ప్రకారం ప్రతి ఇంట్లోనూ ఒక చిన్న పూజ గది( Pooja Room ) కచ్చితంగా ఉంటుంది.ఈ గదిలో దేవతమూర్తుల విగ్రహాలను పెట్టి పూజలు కూడా చేస్తూ ఉంటారు.
ప్రతిరోజు ఇంట్లో పూజ చేయడం వల్ల ఆ ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది.దేవతలను తప్పకుండా పూజ చేస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
తెలిసి తెలియకో ఇంట్లో పెట్టుకోకూడడని దేవత మూర్తుల విగ్రహాలు పూజ గదిలో పెడితే ఇంట్లో చిరాకులు పెరుగుతాయి.ఇలాంటి దేవత మూర్తుల విగ్రహాలు పెడితే ఇంట్లో గొడవలు మొదలవుతాయి.
అయితే ఇంట్లో దేవత విగ్రహాలను పెట్టుకునేటప్పుడు ఎటువంటి విగ్రహాలు పెట్టుకోవాలి.ఎటువంటి విగ్రహాలు పెట్టకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో దేవత విగ్రహాలను పెట్టుకోవాలి అనుకునేవారు రాహు కేతువుల విగ్రహాలను( Rahu Ketu Idols ) ఎప్పుడూ ఇంట్లో ఉంచకూడదు.ఇంట్లో రాహు కేతువుల విగ్రహాలు, చిత్రపటాలు పెట్టుకుంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది.ఆ కుటుంబ సభ్యులు అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇంట్లో మహంకాళి విగ్రహాన్ని( Mahankali Idol ) పొరపాటున కూడా పెట్టకూడదు.తల్లి దుర్గా మరియు పార్వతి దేవి యొక్క మరొక రూపంగా మహంకాళినీ భావిస్తారు.మహంకాళి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది.
ఇంకా చెప్పాలంటే ఇంట్లో లక్ష్మి నరసింహ స్వామి విగ్రహాన్ని( Lakshmi Narasimha Swamy ) ఎప్పుడు ఉంచకూడదు.దుష్టుడైన హిరణ్యకశిపుడిని చంపడానికి విష్ణువు నరసింహస్వామిగా భూమిపై అవతరించాడు.
విష్ణు యొక్క ఉగ్రరూపం అయిన నరసింహ స్వామి అవతారాన్ని ఇంట్లో పెట్టడం అసలు మంచిది కాదు.
అందుకే పొరపాటున కూడా లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహాన్ని ఇంటికి తీసుకురాకూడదు.అలాగే ఇంట్లో పెట్టుకోకూడని మరొక విగ్రహం శని దేవుడి విగ్రహం.( Shani Dev ) శని దేవుడి విగ్రహాన్ని పొరపాటున కూడా ఇంట్లోకి తీసుకొని రాకూడదని నిపుణులు చెబుతున్నారు.
కాబట్టి ప్రతి రోజు ఇళ్లలో పూజలు చేసుకునే వారు దేవుని గదిలో పెట్టుకునే విగ్రహాలను గురించి తెలుసుకొని ముందు జాగ్రత్త పడటం మంచిది అని నిపుణులు చెబుతున్నారు.ఈ అవగాహన లేకుండా ఈ విగ్రహాలను తెచ్చుకుంటే అనవసర కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
LATEST NEWS - TELUGU