ఈ సంవత్సరం కార్తీక మాసం( Kartika month ) అక్టోబర్ 29 వ తేదీన ఆదివారం రోజు నుంచి మొదలైంది.ఈ కార్తీక మాసం నవంబర్ 27వ తేదీ తో ముగుస్తుంది.
అంతే కాకుండా ప్రజలు కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.ఈ మాసంలో శ్రీ మహా విష్ణువును శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తే భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.
అలాగే ఉదయాన్నే నిద్ర లేచి ఎంతో భక్తి శ్రద్ధలతో తులసి చెట్టుకు పూజలు చేస్తారు.అంతేnకాకుండా దేవాలయానికి వెళ్లి దీపాలను వెలిగిస్తారు.
కార్తీక మాసంలో ఆహారం, దుస్తులు, నువ్వులు, దీపాలు, ఉసిరిని దానం చేస్తే కుటుంబానికి మంచిదని చాలా మంది ప్రజలు నమ్ముతారు.
అయితే కార్తీక మాసంలో ఈ పనులు చేస్తే మాత్రం మహా పాపం చుట్టుకుంటుందని పెద్ద వారు చెబుతూ ఉంటారు.మరి ఆ పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే కార్తీక మాసంలో చేయకూడని పనులలో మద్యం సేవించడం, మాంసాహారం తీసుకోవడం అస్సలు చేయకూడదు.
కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి.అలాగే మౌనంగా భోజనం తీసుకోవాలి.
ఇంకా చెప్పాలంటే గుమ్మడి కాయ( Pumpkin ), ఉల్లి పాయ, వెల్లుల్లి, ముల్లంగి వంటి ఆహార పదార్థాలను తినకూడదు.
అలాగే సాత్వికాహారం ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో మంచిది.అంతేకాకుండా పెసర పప్పు, శనగ పప్పు, నువ్వులు కూడా తీసుకోకూడదు.ముఖ్యంగా చెప్పాలంటే కార్తిక మాసం ఆదివారం రోజు మొదలైతే కొబ్బరి, ఉసిరికాయ తీసుకురాదని పెద్ద వారు చెబుతున్నారు.
అంతే కాకుండా నలుగు పెట్టుకుని స్నానం చేయకూడదు.ఇంకా చెప్పాలంటే దీపం దానం ఇచ్చేటప్పుడు ఒక దీపాన్ని( Lamp ) అస్సలు ఇవ్వకూడదు అని పండితులు చెబుతున్నారు.
ఈ కార్తిక మాసంలో ఇలాంటి పనులు చేస్తే మహా పాపం అని పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL