ఎన్టీఆర్ తెలుగు సినిమా పరిశ్రమలో దిగ్గజ నటుడు.తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ కు తరలి రావడంలో కీలక పాత్ర పోషించి వ్యక్తి.
ప్రముఖ నటుడిగా, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించిన వ్యక్తి ఎన్టీఆర్.అయితే ఆయన మొదటి భార్య బసవతారకం గురించి అప్పట్లో పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చేవి.
ఆమెను ఎన్టీఆర్ అస్సలు బయటకు పంపేవాడు కాదనే గుసగుసలు వినిపించేవి.ఆమె గంపెడు పిల్లలను కని పెంచడంతోనే సరిపోయిందనే మాటలు వినపడేవి.
అయితే ఎన్టీఆర్ మాత్రం తన భార్యకు ఎంతో గౌవరం ఇచ్చేవాడని ఇండస్ట్రీలో టాక్ ఉంది.తనను చాలా గౌరవంగా చూసుకునే వాడని చెప్తారు సినీ జనాలు.
నందమూరి తారక రామారావుకు బసవతారకానికి 1942 మే నెలలో పెళ్లి జరిగింది.పెద్దలంతా కలిసి ఆయనకు ఘనంగా వివాహం జరిపించారు.బసవతారకంను ఎన్టీఆర్ మేనరికం చేసుకున్నాడు.తన మేనమామ కూతురైన ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
అయితే బసవతారకానికి చాలా కాలం తర్వాత క్యాన్సర్ వ్యాధి సోకింది.అదే వ్యాధి పెరిగి పెద్దదై.1985లో మరణించింది.ఆమె క్యాన్సర్ మూలంగా చనిపోవడంతో ఎన్టీఆర్ ఎంతో కలత చెందాడు.
తన గుర్తింపుగా హైదరాబాద్ లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ ను స్థాపించాడు.
అటు నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు డజన్ మంది సంతానం.పన్నెండు మందిలో ఎనిమిది మంది కుమారులు.మిగతా నలుగురు కుమార్తెలు.
అబ్బాయిల పేర్లు వరుసగా రామకృష్ణ, జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ-జూనియర్, జయశంకర్ కృష్ణ.
అటు గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు.అయితే ఎన్టీఆర్ బసవతారకంను ఎప్పుడూ బయటకు రానిచ్చేవాడు కాదనే విమర్శలుండేవి.తను జీవితాంతం పిల్లలను కని పెంచే యంత్రంగానే ఉండిపోయిందని చెప్పేవారు.
అయితే ఎన్టీఆర్ గురించి బాగా తెలిసిన వారు మాత్రం ఆ వార్తలను ఖండించే వారు.