జెమిని టీవీ వారు ఎవరు మీలో కోటీశ్వరులు షో ను ప్రకటించారు.ఎన్టీఆర్ హోస్ట్ గా రాబోతున్న సినిమా అవ్వడం వల్ల అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.
అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా షో ఉంటుందనే నమ్మకంను బుల్లి తెర వర్గాల వారికి జెమిని వారు నమ్మకంగా చెబుతున్నారు.ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్స్ ను కూడా చేశారు.
కనుక షో ను ఎప్పుడైనా టెలికాస్ట్ చేయవచ్చు అనుకుంటూ ఉండగానే వచ్చే ఆదివారం ముహూర్తం ఖరారు అయ్యింది.ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల సందడితో మొదటి ఎపిసోడ్ సందడిగా మరాబోతుంది.
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కూడా వచ్చే నెల నుండి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.రెండు షో లు ఒకే సమయంలో రావడంతో పాటు వారం మొత్తం రావడం వల్ల ఖచ్చితంగా రెండు షో లు విపరీతమైన పోలీని కలిగి ఉంటాయని అంతా అనుకుంటున్నారు.

ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో టెలికాస్ట్ టైమ్ ను ప్రకటించడంతో బిగ్ బాస్ ప్రేక్షకులు మరియు నిర్వాహకులు స్టార్ మా ఊపిరి పీల్చుకున్నంత పనైంది.సోమ వారం నుండి గురువారం వరకు అంటే వారంలో నాలుగు రోజులు మాత్రమే ఎవరు మీలో కోటీశ్వరులు రాబోతుంది.అది కూడా రాత్రి 9 గంటలకు కాకుండా రాత్రి 8.30 నిమిషాలకు రాబోతుంది.రాత్రి సమయంలో బిగ్ బాస్ మరియు ఎవరు మీలో కోటీశ్వరులు క్లాష్ అవ్వకుండా ఒక దాని తర్వాత ఒకటి అన్నట్లుగా ప్రసారం కాబోతున్నాయి.ఇక వీక్ డేస్ లో ఒక షో తర్వాత ఒకటి అవ్వగా వీకెండ్స్ లో మాత్రం మొత్తం బిగ్ బాస్ హవా కొనసాగుతుంది.బిగ్ బాస్ వీక్ డేస్ ల్లో రాత్రి 9.30 కి ఉంటుంది.ఇక వీకెండ్స్ లో రాత్రి 9 గంటలకు ఉంటుంది.కనుక ఆ సమయంలో జెమిని టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు టెలికాస్ట్ అయ్యే అవ్వదు.కనుక బిగ్ బాస్ కు ఆ షో కు పోటీ నే లేదు.