ఆల్కలైన్ వాటర్( Alkaline water ).ఈమధ్య కాలంలో తరచుగా వినిపిస్తున్న పేరు.
అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, చైనా, యూరప్ వంటి ఫారెన్ కంట్రీస్ లో ఆల్కలైన్ వాటర్ కు యమా క్రేజ్ ఉంది.ఆల్కలైన్ వాటర్ వన్ లీటర్ బాటిల్ సుమారు రూ.60 నుండి రూ.100 వరకు ఉంటుంది. హాలీవుడ్ సెలబ్రిటీలు, ఫిట్‌నెస్ ట్రైనర్లు ఆల్కలైన్ వాటర్ మంచిదని ప్రచారం చేయడం వల్ల ఆయా దేశాల్లో ధర ఎక్కువైనప్పటికీ చాలా మంది ఆ నీటిని తాగడానికే ఇష్టపడుతున్నారు.ఇండియాలోని మహానగరాల్లో కూడా ఆల్కలైన్ వాటర్ తాగేవారి సంఖ్య పెరుగుతోంది.
అసలు ఆల్కలైన్ వాటర్ ప్రత్యేకత ఏంటి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణ నీటితో పోలిస్తే ఆల్కలైన్ వాటర్ అధిక pH స్థాయిని కలిగిన నీరు.సాధారణ త్రాగునీటి pH స్థాయి సుమారు 7 ఉంటే.ఆల్కలైన్ వాటర్ యొక్క pH స్థాయి 8 నుంచి 9 మధ్య ఉంటుంది.మామూలు త్రాగు నీరు సహజంగా కొన్ని మినరల్స్ కలిగి ఉంటుంది.
ఆల్కలైన్ వాటర్ ను అదనంగా కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ ను కలిపి ప్రాసెస్ చేస్తారు.శాస్త్రీయ ఆధారాలు( Scientific evidence ) లేనప్పటికీ కొన్ని అధ్యయనాలు ప్రకారం.
ఆల్కలైన్ వాటర్ మామూలు నీటితో పోల్చితే త్వరగా శరీర కణాల్లోకి ప్రవేశించి హైడ్రేషన్‌ను మెరుగుపరిచే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

అసిడిటీ సమస్యలతో బాధపడేవారికి ఆల్కలైన్ వాటర్ ఉపయుక్తంగా ఉంటుందని అంటున్నారు.అధిక pH గల నీరు కావడం వల్ల ఆల్కలైన్ వాటర్ శరీరంలో ఆమ్ల స్థాయిని తగ్గించేందుకు సహాయపడుతుందనే నమ్ముతారు.కొన్ని అధ్యయనాలు ఆల్కలైన్ వాటర్ అధిక రక్తపోటు మరియు షుగర్ లెవెల్స్ నియంత్రణకు సహాయపడే అవకాశం ఉందని సూచించాయి.
అంతేకాకుండా ఆల్కలైన్ వాటర్ శరీరంలో ఉండే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను( Harmful free radicals ) తగ్గించడంలో, మనరల్స్ శోషణను మెరుగుపరచడంతో సహాయపడతాయని చెబుతున్నారు.

ఏదేమైనా మామూలు త్రాగు నీటిలో కూడా సమానమైన మినరల్స్ ఉంటాయి, కాబట్టి ఆల్కలైన్ వాటర్ తప్పనిసరిగా ప్రత్యేకమైనదని చెప్పలేం.ఆల్కలైన్ వాటర్ కొంతమందికి ఉపయోగకరంగా ఉండొచ్చు, ముఖ్యంగా అసిడిటీ సమస్యలతో( acidity problems ) బాధపడేవారు ఆల్కలైన్ వాటర్ ను తీసుకోవచ్చు.ఆల్కలైన్ వాటర్ శరీరానికి వంద శాతం మేలు చేస్తుందని శాస్త్రీయంగా పూర్తిగా నిర్ధారించబడలేదు, అందువల్ల సామాన్య ఆరోగ్యవంతులైతే మామూలు మినరల్ వాటర్ తాగినా సరిపోతుంది.







