కోడలి గుర్తింపు పొందాలంటే ఆ మొక్కు తీర్చుకోవాల్సిందేనట!

ఆదివాసీలు, గిరిజనుల ఆచారాలు చాలా వింతగా, కొత్తగా అనిపిస్తుంటాయి మనకు.వారి పూజలు ఎక్కువగా ప్రకృతితోనే మమేకమై ఉంటాయి.

 Nagoba Special Puja For Newly Married Bride, Nagoba, Marred Cuples , Nagoba Spec-TeluguStop.com

చెట్టు, పుట్ట, చేను, అడవి చుట్టూనే వారి దేవతలు కనిపిస్తాయి.అలాంటిదే ఈ నాగోబా జాతర కూడా.

అయితే నాగోబా దేవతను కేవలం జాతర అప్పుడే కాకుండా కొత్తగా పెళ్లైన జంటలు పెళ్లైన వెంటనే… అమ్మవారిని దర్శించుకోవడం తప్పనిసరి అంట.కొత్త పెళ్లి కూతురు పెళ్లైన తర్వాత నాగోబా దేవతను కచ్చితంగా దర్శించుకొని మొక్కు చెల్లించుకోవాలంట.అలా చేయని పక్షంలో ఆమె కోడలిగా గుర్తింపు పొందనట్లేనట.ఈ విషయం వినడానికి కొత్తగా, వింతగా ఉన్నప్పటికీ… ఇది ఎప్పటి నుంచో సాగుతుందట.అంతే కాకుండా మెస్రం వంశీయుల్లో ఎవరైనా చనిపోతే.ఇక్కడే కర్మకాండలు నిర్వహిస్తారట.

అలా చేస్తేనే.చనిపోయిన వారికి మోక్షం లభిస్తుందని నమ్ముతుంటారు గిరిజిన ప్రజలు.

ప్రతీ ఏటా నాగోబా జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.లక్షల్లో గిరిజనులంతా ఒక్క చోట చేరి ఆ అమ్మవారిని దర్శించుకుంటారు.తన ఐకత్యను చాటి చెప్తారు.ఇలా ప్రతీ ఏటా నాగోబా దేవతను పూజించడం వల్ల ఎలాంటి ఆపదలు రావని, ఏడాదంతా మంచి జరుగుతుందని ఆదివాసీల నమ్మకం.

అందుకే ఏడాదంతా ఎక్కడున్నా పండుగ పూట మాత్రం కచ్చితంగా జాతరకు వస్తుంటారు గిరిజన ప్రజలు.ఇటీవలే ఈ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు మెస్రం వంశీయులు.వందలాది మంది గంగాజలం తీసుకొచ్చి.లక్షలాది మంది భక్తుల ఎదుట అభిషేకాలు చేశారు.ఘనంగా జాతరను నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

Nagoba Special Puja For Newly Married Bride, Nagoba, Marred Cuples , Nagoba Special Puja , Nagoba Jatara - Telugu Devotional, Nagoba, Nagoba Jathara

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube