మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉజ్జయిని( Ujjaini ) భారత దేశంలోని పవిత్ర నగరాలలో ఒకటిగా పరిగణిస్తారు.దేవాలయాలు మరియు చరిత్ర ఆత్మకంగా ముఖ్యమైన ప్రాంతాలు ఇక్కడ చాలా ఉన్నాయి.
ఇక ఉజ్జయినిలో ప్రతిహరేశ్వర్ మహాదేవ దేవాలయం( Pratihareshwar Mahadev Temple ) ఎంతో ప్రసిద్ధి చెందింది.ఈ దేవాలయం పాట్నీ బజార్లో ఉంది.
ఆలయం ఆవరణలో దేవుడి భారీ నల్లరాతి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది.వీటితో పాటు దేవాలయం వెలుపల ఉన్న నంది విగ్రహంతో పాటు కార్తికేయుడు, వినాయక, పార్వతీదేవి విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్టించారు.
శివలింగం చుట్టూ ఉన్న స్తంభాలపై సూర్యుడు, చంద్రుడు, ఓంకారం, త్రిశూలం, శంఖం ఉంటాయి.ఇక ఈ దేవాలయంలో సంవత్సరం పొడవునా అన్ని పండుగలు ఎంతో వైభవంగా జరుగుతాయి.

అయితే సావన్ మాసంలో( Sawan ) స్వామివారికి ప్రత్యేక అలంకరణ మహా హారతితో పాటు ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తామని స్థానిక భక్తులు చెబుతున్నారు.బాబా మహాకాల్ నగరంలో శివుడు కణంలో ఉంటారని భక్తులు చెబుతున్నారు.స్వామివారిని దర్శించుకుంటే ఏడు జన్మల పాపాలు నశిస్తాయని, స్వామిని చూడడంతోనే ధనవంతులుగా మారుతారని భక్తులు విశ్వసిస్తున్నారు.మరోవైపు ఈ దేవాలయంలో ఎవరైతే పూర్తి ఆచారాలతో పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారో వారి కుటుంబ సభ్యులందరికీ స్వర్గంలో స్థానం లభిస్తుందని నమ్ముతారు.
పరమశివుడు పార్వతి దేవిని( Shiva Parvati ) వివాహం చేసుకున్న తర్వాత వంద సంవత్సరాలు రాణివాస్ లో నివసించారు.అయితే ఈ సమయంలో మహాదేవుడికి కుమారుడు పుడితే అతడు త్రిలోకుడిని నాశనం చేస్తాడని దేవతలు ఆందోళన చెందారు.

అటువంటి పరిస్థితిలో మహాదేవుని వద్దకు వెళ్లి వేడుకోవాలని గురువు మహా తేజస్వి చెప్పగా అందరూ మందిరాచల్ పర్వతానికి చేరుకున్నారు.ఆ తర్వాత అక్కడ నంది కనిపించాడు.నందిని( Nandi ) ఏమార్చి మహాదేవుని ఏకాంతాన్ని భంగం చేస్తాడని దేవతలు అనుకున్నారు.ఆ సమయంలో దేవతల మాటలను పరమశివుడు విన్నాడు.అప్పుడు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నంది శిక్షించబడ్డాడు.దీంతో నంది భూమి మీద పడి దుఃఖించడం మొదలు పెట్టాడు.
నంది రోదన విన్న దేవతలు నందిని మహాకాళి అడవికి వెళ్లి శివారాధన ప్రాముఖ్యతను తెలియజేశారు.నంది కూడా అలాగే చేశాడు.
లింగాన్ని పూజించి వరం పొందాడు.అప్పుడు పరమాశివుడు నందిని అనుగ్రహించి నీ భక్తికి మెచ్చ అన్నా మాటలు వినిపించాయి.
అప్పటినుంచి ఆ దేవాలయానికి ప్రతిహార్ అనే పేరు వచ్చింది.
DEVOTIONAL