దీపావళి( Diwali )ని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోని ప్రజలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు.దీపావళి అనగానే మనకు గుర్తుకు వచ్చేవి లక్ష్మీదేవి పూజ, పిండి వంటకాలు, కొత్త దుస్తులు, రకరకాల మిఠాయిలు, గిఫ్ట్ బాక్సులు, టపాసుల మోతలు అని కచ్చితంగా చెప్పవచ్చు.
ఈ సాంప్రదాయం చిన్న గ్రామాల నుంచి పెద్ద నగరాల వరకు విస్తరించి ఉంది.పండుగకు నగరాల నుంచి గ్రామాలకు వెళ్లేవాళ్లు వీటిని ఇక్కడి నుంచి తీసుకొని వెళుతుంటారు.
తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సన్నిహితులకు పంచి సరదాగా పండుగను జరుపుకుంటూ ఉంటారు.అయితే ఒక ప్రాంతంలో మాత్రం టపాసులు మోత అసలు ఉండదు.
దీపావళిని ఎలాంటి క్రాకర్స్ కాల్చకుండా నిశ్శబ్దంగా జరుపుకుంటారు.

దీపావళి అంటేనే బాంబుల మోత అని కొందరు భావిస్తూ ఉంటారు.అలాంటి వారికి ఈ ఏడు గ్రామాలు ఆదర్శం అని చెప్పవచ్చు.మారి ఆ ప్రాంతాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడులోని ఈరోడ్ జిల్లా( Erode )లో ఏడు గ్రామాల ప్రజలు ఎలాంటి టపాసులు కాల్చకుండా నిశ్శబ్దంగా దీపావళిని జరుపుకుంటారు.దీంతో పాటు ఎలాంటి దీపాలు వెలిగించకుండా జరుపుకోవడం మరో విశేషం అని చెబుతున్నారు.
ఈ ఏడు గ్రామాల మధ్యలో పక్షుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఇది ఈరోడ్ కి కేవలం 10 కిలో మీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది.
దీని పేరు వడముగం వెల్లోడ్ బర్డ్ సాంక్చుయరీ( Vellode Bird Sanctuar ).దీన్ని 1996లో 80 ఎకరాల్లో నిర్మించారు.ఇందులో ఎన్నో రకాల పక్షి జాతి జాతులు నివసిస్తూ ఉన్నాయి.

ఇవి ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తాయి.4 నెలల పాటు ఇక్కడే ఉండి వాటి సంతానోత్పత్తిని పెంచుకుంటాయి.ఇలాంటి క్రమంలో గుడ్లను పెట్టి పొదిగేలా చేసుకుంటాయి.
వీటికి పెద్ద పెద్ద శబ్దాలు, కాంతి అంటే భయం అనే స్థానిక ప్రజలు చెబుతున్నారు.అందుకే వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు నిశ్శబ్దంగా దీపావళిని జరుపుకుంటారు.
ల్లప్పంపాళయం, వడముగం వెల్లోడే, సెమ్మందంపాళయం, కరుక్కనకట్టు వలస, పుంగంపాడి గ్రామంలో దాదాపు వెయ్యి కుటుంబాలు పక్షుల జాతిని పరిరక్షించడానికి చిన్న నీప్పు రవ్వలు వస్తూ ఎక్కువ కాంతి ఇవ్వని టపాసులను కలుస్తారు.ఈ పద్ధతి 17 సంవత్సరాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు.