జుట్టు స్ట్రైట్‌గా నిగనిగలాడాలని చాలా మంది అమ్మాయిలు కోరుకుంటారు.స్ట్రెయిట్ హెయిర్ అనేది చూసేందుకు స్టైలిష్‌గా, ఎట్రాక్టివ్‌గా కనిపిస్తుంది.
అందుకే అనేక మంది స్ట్రెయిట్ హెయిర్ కోసం తెగ ఆరాటపడతారు.అందుకోసం హెయిర్ స్ట్రెయిట్‌నర్‌ని ఎంచుకుంటారు.
మరి కొందరు బ్యూటీ పార్లర్స్ చుట్టు తిరుగుతూ జుట్టుకు రకరకాల ట్రీట్‌మెంట్స్ చేయించుకుంటారు.కానీ, రోజూ హెయిర్ స్ట్రెయిట్‌నర్‌ని ఉపయోగించడం, కెమికల్స్ అధికంగా ఉండే ఉత్పత్తులతో ట్రీట్‌మెంట్స్ చేయించుకోవడం జుట్టుకు ఏ మాత్రం మంచిది కాదు.
అందుకే సహజ పద్ధతుల్లోనే జుట్టును స్ట్రైట్‌గా మార్చుకునేందుకు ప్రయత్నించాలి.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే హోం మేడ్ సీరమ్ అద్భుతంగా సహాయపడుతుంది.ఈ సీరమ్ ను వాడటం వల్ల మీ జుట్టు న్యాచురల్‌గా స్ట్రైట్‌గా నిగనిగలాడుతుంది.మరి ఇంకెందుకు లేటు ఈ హెయిర్ సీరమ్‌ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఐదు నుంచి ఎనిమిది టేబుల్ స్పూన్ల అలోవెర జెల్‌ను వేసుకోవాలి.ఆ తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల కోకనట్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్, నాలుగు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ వేసుకుని ఒక నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి.

చివరిగా అందులో రెండు నుంచి నాలుగు చుక్కలు జాస్మిన్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకంటే హోం మేడ్ సీరమ్ సిద్ధమైనట్లే.
ఈ హెయిర్ సీరమ్‌ను ఒక బాటిల్‌లో నింపుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే రెండు వారాల పాటు వాడుకోవచ్చు.హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఈ సీరమ్ ను జుట్టు మొత్తానికి అప్లై చేసుకోవాలి.ఇలా తరచూ చేస్తుంటే.నిగనిగలాడే స్ట్రైట్ హెయిర్ మీసొంతం అవుతుంది.పైగా ఈ సీరమ్‌ను వాడటం వల్ల డ్రై, ఫ్రిజ్జీ హెయిర్ వంటి సమస్యలు సైతం దూరం అవుతాయి.







