ముఖ్యంగా చెప్పాలంటే నారింజలు, ఆపిల్స్, దానిమ్మ వంటి పండ్లను తినేందుకు ఎంతో మంది ప్రజలు ఇష్టపడతారు.కానీ బత్తాయి పండ్లను( Mosambi fruits ) తినేందుకు చాలా మంది ప్రజలు అంతగా ఆసక్తి చూపించారు.
అది కాస్త పుల్లగా ఉంటుంది.కాబట్టి దాన్ని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు తినడానికి అంత ఆసక్తి చూపించరు.
కాబట్టి మోసంబిని అధిక శాతం మంది తినరు.అయితే ఆరోగ్యం కోసం ఖచ్చితంగా తినాల్సిన పండ్లలో మోసంబిని మొదటి స్థానంలో ఉంటుంది.
ఈ పండ్లు తినడం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
వీటి వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటాయి.

దీని వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.పొట్ట సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.పొట్ట లో మంట, అజీర్ణం, గ్యాస్ ( Indigestion, gas )సమస్యలతో బాధపడేవారు బత్తాయి పండును తినడం ఎంతో మంచిది.
అలాగే బొప్పాయి రసంలో చక్కెర వేయడం అసలు మంచిది కాదు.దీనిలో ఖనిజాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.ఈ పండు తినడం వల్ల డిహైడ్రేషన్ సమస్య( Dehydration problem ) చాలా వరకు దూరమవుతుంది.అలాగే మోసంబి రసం రోజు తాగితే మీ చర్మం ఎంతో మృదువుగా మారుతుంది.
అలాగే చర్మం కాంతివంతంగా కూడా మారుతుంది.జుట్టు పెరుగుదలపై కూడా మోసంబి చాలా ప్రభావం చూపుతుంది.

కంటి ఇన్ఫెక్షన్లు( Eye infections ) రాకుండా కూడా బత్తాయి కాపాడుతుంది.కంటి సమస్యతో బాధపడేవారు బత్తాయిని తినడం ఎంతో మంచిది.అలాగే ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.అలాంటివారు బత్తాయి పండును తమ డైట్ లో చేర్చుకోవడం ఎంతో మంచిది.అది బరువును త్వరగా తగ్గిస్తుంది.కొందరికి వాంతులు వికారం వచ్చినట్లుగా కూడా అనిపిస్తూ ఉంటుంది.
అలాంటివారు ఈ పండును తింటే ఆ లక్షణాలు దూరం అయిపోతాయి.కిడ్నీలలో రాళ్లు రాకుండా ఉండాలంటే బత్తాయిని క్రమం తప్పకుండా తింటూ ఉండాలి.
ఈ పండు రోజు ఒకటి తింటే కిడ్నీలో రాళ్లు వచ్చే సమస్య పూర్తిగా దూరమవుతుందని కొన్ని అధ్యయనాలలో తెలిసింది.