తెలుగు సినిమా ఇండస్ట్రిలో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపుని సంపాదించుకున్న రాజమౌళి( Rajamouli ) సైతం ప్రస్తుతం మహేష్ బాబు( Mahesh Babu ) చేస్తున్న సినిమా కోసం తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నాడు.ఇక ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను ముగించుకున్న రాజమౌళి తొందర్లోనే రెండో షెడ్యూల్ తో మళ్లీ బిజీ కానున్నట్టుగా తెలుస్తోంది.
ఇక రీసెంట్ గా మహేష్ బాబు ఎండ తీవ్రతను తట్టుకోలేక ఫారన్ వెళ్లి ఒక టూర్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశ్యం లో ఉన్నాడు.మరి ఎండలు తగ్గేంత వరకు ఆయన హైదరాబాద్ లో అడుగుపెట్టే అవకాశాలు లేనట్టుగా కనిపిస్తున్నాయి.
దానివల్ల ఈ రెండు నెలలు రాజమౌళి షూటింగ్ కి అంతరాయం కలిగే ప్రమాదమైతే ఉంది.కానీ రాజమౌళి మాత్రం దాన్ని తెలివిగా వాడుకొని మహేష్ బాబు లేని సన్నివేశాలను చిత్రీకరించే పనిలో బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ( Ramoji Film City ) లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతుందంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…ఇక ఏది ఏమైనా కూడా 2027వ సంవత్సరంలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి రాజమౌళి సన్నాహాలు చేసుకుంటున్నాడు.కాబట్టి మహేష్ బాబు ఉన్న లేకపోయిన షూటింగ్ ఆపే ప్రసక్తే లేదు అనే రేంజ్ లో ముందుకు సాగుతున్నాడు.ప్రస్తుతం ఆయన చేస్తున్న ఈ సినిమా అతనికి ఎలాంటి గుర్తింపు సంపాదించి పెడుతుంది.

తద్వారా ఆయన ఎలాంటి అద్భుతలను చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు తీసుకురావాలనే ఉద్దేశ్యం లో రాజమౌళి ఉన్నాడు.ఇక అలాగే మహేష్ బాబుకి సైతం నేషనల్ అవార్డు వస్తుంది అనే కాన్ఫిడెంట్ లో రాజమౌళి ఉండడమే కాకుండా మహేష్ బాబుతో ఈ సినిమాకి ఏదైతే కావాలో అది రాబట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…
.