ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన ఆహారాల్లో ఫ్రూట్స్ కే అగ్రస్థానం అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఆరోగ్యాన్ని పెంచడంలోనూ, అనేక అనారోగ్య సమస్యలను నివారించడంలోనూ పండ్లు ఎంతగానో సహాయపడతాయి.
అందుకే ఆరోగ్యానికి నిపుణులు రోజుకు కనీసం రెండు రకాల పండ్లనైనా తీసుకోవాలని సూచిస్తుంటారు.ఇక ఆరోగ్యానికే కాదు.
చర్మ సౌందర్యానికీ ఫ్రూట్స్ ఉపయోగపడతాయి.ముఖ్యంగా ఫ్రూట్స్‌తో ఇంట్లోనే పలు ఫేస్ క్రీమ్స్‌ను తయారు చేసుకోవచ్చు.
మరి ఆ క్రీమ్స్ ఏంటి.? వాటిని ఎలా తయారు చేసుకోవాలి.? అసలు ఆ క్రీమ్స్ వాడటం వల్ల ఏయే ప్రయోజనాలు లభిస్తాయి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కమలా పండు.ఈ సీజన్‌లో విరివిగా లభించే పండు.మరియు ఎంతో మంది ఇష్టంగా తినే పండు.అయితే కమలా పండులో గింజలు తీసేసి జ్యూస్‌లా తయారు చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్‌లో నాలుగు స్పూన్ల కమలా పండు జ్యూస్, రెండు స్పూన్ల అలోవెర జెల్, ఒక స్పూన్ గ్లిజరిన్, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే క్రీమ్ సిద్ధమైనట్టే.ఒక గాజు సీసాలో నింపుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే దాదాపు పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటుంది.
ఈ క్రీమ్‌ను రాత్రి నిద్రించే ముందు ముఖానికి, మెడకు అప్లై చేసుకుని నిద్రిస్తే.చర్మం తెల్లగా, నిగారింపుగా మారుతుంది.
డ్రై స్కిన్ నుంచి విముక్తి లభిస్తుంది.ఎటువంటి మొండి మొటిమలైనా దూరం అవుతాయి.

పుచ్చకాయతోనూ ఫేస్ క్రీమ్‌ను తయారు చేసుకోవచ్చు.అందుకోసం గింజలు తీసేసి పుచ్చకాయ పల్ప్‌ను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు మూడు స్పూన్ల పుచ్చకాయ పేస్ట్‌లో ఒక స్పూన్ టీ ట్రీ జెల్, ఒక స్పూన్ ఆల్మండ్ ఆయిల్, ఒక విటమిన్ ఇ క్యాప్సుల్ ఆయిల్ వేసి మిక్స్ చేసుకుంటే.క్రీమ్ రెడీ అయినట్టే.
గాజు సీసాలో నింపుకుని ఫ్రీజ్‌లో పెడితే వారం రోజుల పాటు ఇది ఉంటుంది.రోజూ ఈ క్రీమ్‌ను ఫేస్‌కి అప్లై చేస్తే ముడతలు, నల్ల మచ్చలు తగ్గుతాయి.
ముఖ చర్మం తాజాగా, యవ్వనంగా మారుతుంది.మరియు చర్మం బిగుతుగా మారుతంది.